News February 24, 2025
ఏలూరు: కళ్లల్లో కారం కొట్టి.. బ్యాగ్ అపహరణ

ఏలూరు వన్ టౌన్ నుంచి టూ టౌన్ కి నగదు బ్యాగ్ తో వెళ్తున్న నిడదవోలుకు చెందిన కాస్మెటిక్స్ తయారీ కంపెనీ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ గొట్టాల వీరేశ్ పై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. బైక్ పై వచ్చిన వారు వీరేశ్‌ను ఆపి, కళ్లల్లో కారం కొట్టి బ్యాగ్ లాక్కుపోయారు. అందులో రూ. 2,41,600 నగదు ఉందని, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 24, 2025
వనపర్తి: బాల్యవివాహాల అడ్డకట్టకు ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

వనపర్తి జిల్లాలో బాల్య వివాహాలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. P.M మోదీ 2015 జనవరి 22న బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారంభించి పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు ఎక్కడైనా జరిగితే 1098 కు సమాచారం ఇవ్వాలన్నారు.
News February 24, 2025
నిజామాబాద్: నరేందర్ రెడ్డిని గెలిపించండి: ముఖ్యమంత్రి

నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. నరేందర్ రెడ్డి మండలిలో పట్టభద్రుల సమస్యలపై గొంతుకను వినిపిస్తారని అన్నారు. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజల సమస్యల వాణికి వినిపిస్తారని పేర్కొన్నారు.
News February 24, 2025
జగిత్యాల: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఉద్యోగులకు ప్రత్యేకసెలవు: కలెక్టర్

ఈనెల 27న జరిగే పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థ లేదా ఇతర అన్ని ప్రైవేట్ మేనేజ్‌మెంట్ అథారిటీల్లో పనిచేస్తూ గ్రాడ్యుయేట్ ఓటుహక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులకు సైతం ఓటుహక్కు వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతి ఇవ్వాలన్నారు.