News August 4, 2024
ఏలూరు: కానిస్టేబుల్‌పై కేసు నమోదు
కానిస్టేబుల్‌పై కేసు నమోదైన ఘటన ఏలూరులో జరిగింది. పోలీసుల వివరాలు.. ఏలూరులోని వంగాయగూడేనికి చెందిన లింగేశ్వరరావు ఇస్త్రీ బండి నిర్వహిస్తున్నారు. అతనితో గ్రామీణ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రీనివాస రెడ్డి పరిచయం పెంచుకున్నారు. లింగేశ్వరరావు కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పలు దఫాల్లో రూ.7 లక్షలు తీసుకున్నాడు. ఎంతకీ ఉద్యోగం ఇప్పించకపోగా బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News September 11, 2024
ఉమ్మడి ప.గో. జిల్లాలో నేడు సీఎం పర్యటన ఇలా..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నేడు (బుధవారం) సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం ఏలూరు జిల్లా కైకలూరు వద్ద ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే చేస్తారు. 11 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా దుంపగడప గ్రామ పరిధిలో ఉన్న ఉప్పుటేరు వంతెనకు చేరుకుని వరద పరిస్థితిని పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. అనంతరం హెలికాప్టర్‌లో కాకినాడ జిల్లా సామర్లకోట బయలుదేరి వెళ్తారు.
News September 11, 2024
ఏలూరు: గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి
నిడదవోలు పట్టణంలోని బసిరెడ్డిపేట రేవు వద్ద మంగళవారం రాత్రి వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో అపశ్రుతి జరిగింది. చాగల్లు మండలం బ్రాహ్మణగూడేనికి చెందిన పి.రాజేష్ పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో గల్లంతయ్యాడు. గ్రామం నుంచి గణేశ్ విగ్రహాన్ని పట్టణంలో రేవుకు తీసుకొచ్చి నిమజ్జనం చేస్తుండగా గల్లంతయ్యాడు. యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ శోభన్ కుమార్ తెలిపారు.
News September 11, 2024
ఏలూరులో జాబ్ మేళా.. 77 మంది ఎంపిక
ఏలూరు ప్రభుత్వ డీఎల్ టీసీ, ఐటీఐ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు 224 మంది హాజరయ్యారని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళాలో 77 మందిని అర్హులుగా గుర్తించి, వివిధ కంపెనీలలో ఉపాధి కల్పించామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్.ఉగాది రావు, జిల్లా ప్లేస్మెంట్ అధికారి(ఒకేషనల్) వరలక్ష్మి, వై.పి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.