News May 18, 2024

ఏలూరు: కాపాడబోయి.. యువకుడు స్పాట్ డెడ్

image

రొయ్యల చెరువులో పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. కైకలూరు నియోజకవర్గ పరిధి ముదినేపల్లిలోని రొయ్యల చెరువులో కోల్‌కతాకు చెందిన షైపుల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన బొర్రా బాలసాయి పనిచేస్తున్నారు. శుక్రవారం షైపుల్లా స్విచ్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతడిని కాపాడే క్రమంలో బాలసాయి మృతి చెందాడు.

Similar News

News February 24, 2026

పాలకొల్లు: మళ్లీ ‘ఫ్యాన్’ కిందకే మేకా.. సస్పెన్షన్ ఎత్తివేత?

image

మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తిరిగి వైసీపీ గూటికి చేరనున్నారు. తాడేపల్లిలో పార్టీ అధినేత జగన్‌‌ని ఆయన తన కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 9న జరగనున్న తన కుమారుడి వివాహానికి హాజరుకావాల్సిందిగా జగన్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ భేటీ నేపథ్యంలో శేషుబాబుపై గతంలో ఉన్న సస్పెన్షన్‌ను అధిష్ఠానం ఎత్తివేసినట్లు తెలుస్తోంది.

News February 24, 2026

పీజీఆర్ఎస్‌కు 19 అర్జీలు: ఎస్పీ

image

భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్’ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి 19 అర్జీలను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అందిన ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడబోమని స్పష్టం చేశారు.