News March 5, 2025
ఏలూరు: ‘కులాంతర వివాహం చేసుకున్నాడని యువకుడిపై దాడి’

ఏలూరులోని దొండపాడుకి చెందిన దాడిశెట్టి మణికంఠ, పల్నాడు జిల్లాకు బొలిసిపాడుకి చెందిన యువతి ఈ నెల 1వ తేదీన మణికంఠ కుటుంబ సభ్యుల సమక్షంలో ద్వారకాతిరుమలలో కులాంతర వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు సోమవారం రాత్రి తమ ఇంటిపై దాడి చేశారని మణికంఠ కుటుంబ సభ్యులు తెలిపారు. మణికంఠను కొట్టి యువతిని తీసుకువెళ్లినట్లు చెప్పారు. బాధితుడు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Similar News
News December 10, 2025
టేకులపల్లి: లారీని ఢీకొట్టి యువకుడికి తీవ్రగాయాలు

టేకులపల్లి మండలంలోని బోరింగ్ తండా నుంచి టేకులపల్లి వైపు వస్తున్న బైక్ బుధవారం లారీని ఢీ కొట్టడంతో వ్యక్తికి గాయాలయ్యాయి. కొత్తగూడెం నుంచి బొగ్గు తరలిస్తున్న లారీని ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 10, 2025
WGL: కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి

వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నంబర్-1పై ఖమ్మం వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కబోతూ గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. శరీరం నడుము వద్ద తెగి రెండు ముక్కలైంది. మృతుడు తెలుపు, లేత నీలిరంగు చారల షర్ట్ ధరించి ఉన్నాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.
News December 10, 2025
NTPCలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

<


