News February 25, 2025
ఏలూరు: కూటమి అభ్యర్థితో వైరల్ అవుతున్న పవన్ AI ఫొటో

ఏలూరు జిల్లాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ AI ఫొటో వైరల్‌గా మారింది. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి పట్టభద్రుల MLC కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌కి నిన్న మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన ఓ వీడియో ద్వారా సోమవారం తెలిపారు. అయితే ఆయన ఓటును అభ్యర్థిస్తూ AIతో చేసిన ఫొటోను కూటమి నేతలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.
Similar News
News November 19, 2025
పుట్టపర్తిలో మోదీ ‘గో-గిఫ్ట్’.. 100 ఆవుల దానం

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా నేడు పుట్టపర్తికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ తన దాతృత్వాన్ని చాటనున్నారు. గుజరాత్‌కు చెందిన 100 జీఐఆర్ ఆవులను ప్రశాంతి నిలయానికి విరాళంగా అందజేయనున్నారు. వీటిని జిల్లా రైతులకు అందజేయనున్నట్లు తెలిసింది. రోజుకు 10 నుంచి 15 లీటర్ల పాలు ఇచ్చే ఈ ఆవులు రైతులకు ఆర్థికంగా తోడ్పాటునివ్వనున్నాయి.
News November 19, 2025
నేడు బాపట్ల జిల్లా రైతుల ఖాతాల్లో రూ.107.21కోట్లు జమ!

బాపట్ల జిల్లాలోని సుమారు 1,60,441 రైతుల అకౌంట్లలోకి అన్నదాత సుఖీభవ 2వ విడత రూ.5,000, పీఎం కిసాన్ 21వ విడత రూ.2,000 కలిపి మొత్తంగా రూ.7,000లు బుధవారం జమ కానున్నాయి. ఈ మేరకు జిల్లా ఇన్‌ఛార్జి డీఏవో కె.అన్నపూర్ణమ్మ వివరాలను మంగళవారం వెల్లడించారు. జిల్లాలోని 25 మండలాల్లోని రైతులకు రూ.107.21 కోట్ల లబ్ధి చేకూరనున్నట్లు ఆమె తెలిపారు.
News November 19, 2025
నేటి నుంచి పత్తి కొనుగోళ్లు యథాతథం: మంత్రి

TG: <<18308868>>జిన్నింగ్<<>> మిల్లర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వారి సమస్యలపై కేంద్రానికి నివేదిక పంపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నేటి నుంచి పత్తి కొనుగోళ్లను కొనసాగించాలన్నారు. మరోవైపు మొక్కజొన్న కొనుగోలు పరిమితిని ఎకరానికి 18 నుంచి 25 క్వింటాళ్లకు, సోయాబీన్ 6.72 నుంచి 10qlకు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ అథెంటికేషన్‌తో పాటు మొబైల్ OTP ఆధారంగా కొనుగోళ్లు జరపాలని సూచించారు.


