News February 25, 2025

ఏలూరు: కూటమి అభ్యర్థితో వైరల్ అవుతున్న పవన్ AI ఫొటో

image

ఏలూరు జిల్లాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ AI ఫొటో వైరల్‌గా మారింది. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి పట్టభద్రుల MLC కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌కి నిన్న మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన ఓ వీడియో ద్వారా సోమవారం తెలిపారు. అయితే ఆయన ఓటును అభ్యర్థిస్తూ AIతో చేసిన ఫొటోను కూటమి నేతలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

Similar News

News July 8, 2025

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్..51% పనులు పూర్తి.!

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 51 శాతం పనులు పూర్తయినట్లు SCR GM సందీప్ మాథూర్ తెలియజేశారు. ఎక్కడికక్కడ క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ పరీక్షలు చేత నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

News July 8, 2025

HYD: GHMC హెడ్ ఆఫీస్‌లో 2.5 టన్నుల ఈ-వేస్ట్‌ తొలగింపు.!

image

స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో భాగంగా HYD జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లోని ఐటీ విభాగం నుంచి 2.5టన్నుల ఈ-వేస్ట్‌ను అధికారులు తొలగించారు. ఇందులో పాత కంప్యూటర్లు, ప్రింటర్లు, కార్ట్రిడ్జీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. ఈ-వేస్ట్‌ను ఆసియాలోనే మొదటి LEED ప్లాటినమ్-సర్టిఫైడ్ ఫెసిలిటీ అయిన దుండిగల్ వద్దకు తరలించారు. ఇక్కడే రీసైకిలింగ్ జరుగుతుందని తెలిపారు.

News July 8, 2025

నెల్లూరు రాజకీయాలకు మాయని మచ్చ..!

image

హుందాగా నడిచే నెల్లూరు రాజకీయాలు వ్యక్తిగత దూషణలకు వెళ్లాయి. పర్సంటేజీల ప్రసన్న, అప్పుల్లో పీహెచ్‌డీ చేసిన ప్రసన్న అంటూ ప్రశాంతి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆయన శ్రుతిమించారు. ‘ప్రశాంతి రెడ్డి చాలా చోట్ల PHdలు చేశారు. పీహెచ్‌డీలు అంటే మీరు అనుకునేవి కావు. వేమిరెడ్డిని బ్లాక్‌మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది. ఆయనకు ప్రాణహాని ఉంది’ అని ప్రసన్న అన్నారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలపై మీరేమంటారు?