News March 3, 2025
ఏలూరు: కొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర

గత నెల 27వ తేదీన జరిగిన ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. కాగా అభ్యర్థులు అందరూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తుది ఫలితం సోమవారం సాయంత్రం 6 గంటలకు వెల్లడి కానుంది.
Similar News
News November 23, 2025
NRPT: భూనిర్వాసిత సంఘం అధ్యక్షుడి మశ్చీందర్ బాగ్లి మృతి

నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ భూనిర్వాసిత సంఘం అధ్యక్షుడు మశ్చీందర్ బాగ్లి శనివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. కృష్ణ మండలం హిందూపూర్కి చెందిన మశ్చీందర్ భూ నిర్వాసితుల పక్షాన నిలబడి అనతి కాలంలోనే ఓ నాయకుడి ఎదిగారు. 60 రోజుల పాటు భూ నిర్వాసితుల సమస్యలపై వివిధ పార్టీలతో కలిసి సమిష్టిగా పోరాటం చేశారు. ఆయన మరణం జిల్లాలో నిరాశను నింపింది. పలువురు నాయకులు, రైతులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
News November 23, 2025
జనగామ: నేడే ఎన్ఎంఎంఎస్ పరీక్ష..!

కేంద్ర ప్రభుత్వం 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు అందించే రూ.12 వేల ఉపకార వేతనానికి సంబంధించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఆదివారం జరగనుంది. ఇందుకు జనగామ జిల్లాలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 729 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పర్యవేక్షణకు నలుగురు చీఫ్ సూపరింటెండెంట్ లు, నలుగురు డిపార్ట్మెంట్ ఆఫీసర్లను, 40 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.
News November 23, 2025
అచ్చంపేట: యువకుడిపై పోక్సో కేసు నమోదు

అచ్చంపేట మున్సిపాలిటీ పరిధికి చెందిన బాలికపై అదే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువకుడు అఘాయిత్యం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్ కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.


