News August 13, 2024

ఏలూరు: గంజాయి రవాణా.. ఏడుగురు అరెస్ట్

image

ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్‌గేట్ వద్ద ఏలూరు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు సోమవారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో చింతపల్లి నుంచి గంజాయి కొనుగోలు చేసి రవాణాచేస్తున్న ఏడుగురు వ్యక్తులను గుర్తించారు. వారి వద్ద 20.30 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఏలూరు ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఎస్పీ సూర్యచంద్రరావు తెలిపారు. వారిని అరెస్ట్ చేశామన్నారు.

Similar News

News September 11, 2024

దేవరపల్లి యాక్సిడెంట్.. CM తీవ్ర దిగ్భ్రాంతి

image

దేవరపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేసిందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News September 11, 2024

ప.గో. జిల్లాలో సీఎం పర్యటన రద్దు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకివీడులో హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి అనువుగా లేనందున పర్యటనలో మార్పుచేసినట్లు అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లాలో పర్యటన యథావిధిగా కొనసాగనుండగా, పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం పర్యటన రద్దు అయినట్లు కలెక్టర్ తెలిపారు.

News September 11, 2024

ఉమ్మడి ప.గో. జిల్లాలో నేడు సీఎం పర్యటన ఇలా..

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నేడు (బుధవారం) సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం ఏలూరు జిల్లా కైకలూరు వద్ద ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే చేస్తారు. 11 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా దుంపగడప గ్రామ పరిధిలో ఉన్న ఉప్పుటేరు వంతెనకు చేరుకుని వరద పరిస్థితిని పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. అనంతరం హెలికాప్టర్‌లో కాకినాడ జిల్లా సామర్లకోట బయలుదేరి వెళ్తారు.