News March 26, 2025
ఏలూరు: గోవిందుడిని దర్శించిన గోమాత

నిడమర్రు మండలం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దైవ దర్శనార్థం కోసం ఉదయాన్న వచ్చిన గోమాతను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. నిడమర్రు గ్రామంలో స్వయంభు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగింది. ఈ సంఘటన సోమవారం ఉదయం తెల్లవారుజామున జరిగింది. గోమాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అనంతరం ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చి స్వామివారి దర్శించుకుని వెళ్లటం చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.
Similar News
News October 23, 2025
లేటెస్ట్ మూవీ అప్డేట్స్!

* రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మారుతి తెరకెక్కిస్తోన్న ‘రాజాసాబ్’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
* ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డూడ్’ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. ఈనెల 17న ఈ చిత్రం రిలీజవగా వారం రోజుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం.
News October 23, 2025
రాష్ట్రస్థాయి పోటీల్లో NZB క్రీడాకారులకు మెడల్స్

రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో HYDలో నిర్వహించిన అండర్ 19 రెజ్లింగ్ పోటీల్లో NZB క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన 2 గోల్డ్ మెడల్స్ 3 రజత పథకాలు సాధించారని కోచ్ సంతోష్ తెలిపారు. సఫీయా 76kg విభాగంలో కృష్ణ 65KG విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారన్నారు. మెడల్స్ సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.
News October 23, 2025
జిల్లాలో మూడు చోట్ల వ్యాసరచన, వక్తృత్వ పోటీలు: DEO

పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవం పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మూడు చోట్ల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. 8 నుంచి టెన్త్ విద్యార్థులు దేశభక్తి, సామాజిక బాధ్యత, చట్టాలు అనే అంశాలపై వ్యాసరచన అద్భుత పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. రాయచోటి డైట్ కళాశాల, మదనపల్లి జడ్పీ హై స్కూల్, రాజంపేట గర్ల్స్ హైస్కూల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు.