News March 26, 2025
ఏలూరు: గోవిందుడిని దర్శించిన గోమాత

నిడమర్రు మండలం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దైవ దర్శనార్థం కోసం ఉదయాన్న వచ్చిన గోమాతను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. నిడమర్రు గ్రామంలో స్వయంభు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగింది. ఈ సంఘటన సోమవారం ఉదయం తెల్లవారుజామున జరిగింది. గోమాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అనంతరం ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చి స్వామివారి దర్శించుకుని వెళ్లటం చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.
Similar News
News April 22, 2025
లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయర్: VSR

AP: లిక్కర్ స్కామ్‌లో తాను ఒక్క రూపాయీ ముట్టలేదని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ‘ఏపీ లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయర్(సమాచారాన్ని బహిర్గతం చేసే వ్యక్తి). దొరికిన దొంగలు, దొరకని దొంగలు తప్పించుకునేందుకే నా పేరును లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను’ అని తెలిపారు.
News April 22, 2025
పర్యాటక కేంద్రంగా అనంతగిరి అభివృద్ధి: డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్

పర్యాటక కేంద్రంగా ఉన్న అనంతగిరి జూన్ చివరి నాటికి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. కోటి నలభై లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావచ్చాయని తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం జూన్ చివరి వారంలో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
News April 22, 2025
శ్రీరాంపూర్: రక్షిత మంచి నీటిని అందించాలి:TBGKS

సింగరేణి సంస్థలో మెడికల్ రిఫరల్ విధానాన్ని సులభతరం చేసి కార్మికులకు అనువైన మెడికల్ విధానాన్ని అమలు చేయాలని TBGKSయూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. శ్రీ రాంపూర్ ఏరియా SRP-3&3Aగని మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. జనరల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ..బెల్లంపల్లి రీజియన్ లోని కార్మికుల కుటుంబాలకు రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. కార్మికులు, కుటుంబాలకు సంక్షేమ చర్యలు విస్తృతపరచాలన్నారు.