News January 23, 2025
ఏలూరు: గ్రామ సభల అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి

రెవెన్యూ సదస్సుల్లో, రీసర్వే గ్రామ సభల్లో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో వివిధ రెవెన్యూ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల నమోదు, పరిష్కార ప్రక్రియ పురోగతి, 22 ఏ కేసుల స్థితి తదితర అంశాలపై ఆమె సమీక్షించారు.
Similar News
News February 13, 2025
ఏలూరు : విద్యార్థులతో టీచర్ అసభ్య ప్రవర్తన

ఏలూరు రూరల్ మండలంలోని సత్రంపాడు జెడ్పీ హైస్కూలులో సోషల్ స్డడీస్ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో వెంకటలక్ష్మి బుధవారం రాత్రి తెలిపారు. ఇటీవల గుడ్ టచ్- బ్యాడ్ టచ్ పై విద్యార్థులకు అభయ మహిళా రక్షక బృందం అవగాహన కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులు వారికి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపి టీచర్ సాల్మన్ రాజును సస్పెండ్ చేస్తామన్నారు. కాగా ఆయన మరో ఏడాదిలో రిటైర్ అవ్వనున్నారు.
News February 13, 2025
ఉంగుటూరులో బర్డ్ ఫ్లూ

బర్డ్ ఫ్లూపై ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి కీలక ప్రకటన చేశారు. ఉంగుటూరు(M) బాదంపూడిలోని ఓ పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణైనట్లు తెలిపారు. దీంతో బాదంపూడి పౌల్ట్రీ నుంచి కిలీమీటురు పరిధి వరకు రెడ్ జోన్, పది. కి.మీ పరిధిని సర్వేసెన్స్ జోన్ గా ప్రకటించినట్లు తెలిపారు.
News February 13, 2025
ప.గో : కోళ్ల నుంచి కుక్కలకు.. మనుషులకు సోకే ఛాన్స్

ఉమ్మడి ప.గో జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. ఇదే క్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాలలో కుక్కలు కూడా చర్మవ్యాధులతో దర్శనమిస్తున్నాయి. అయితే కోడి వ్యర్థాలు తినడం వలనే కుక్కలు ఈ విధంగా బాధపడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. గాలి ద్వారా ఇది మనుషులకు కూడా సోకే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.