News June 18, 2024

ఏలూరు: ఘనంగా కూతురి బర్త్‌డే.. అంతలోనే నాన్న మృతి

image

ద్వారకాతిరుమల మండలం దొరసానివాడు గ్రామానికి చెందిన సంజయ్ కుమార్(24) ఓ పాఠశాల బస్సు డ్రైవర్‌. ఐదేళ్ల క్రితం నల్లజర్ల మండలం పోతవరానికి చెందిన తేజాను లవ్‌మ్యారేజ్ చేసుకున్నాడు. ఇద్దరికీ తల్లిదండ్రులు లేరు. ఆదివారం తమ కుమార్తె పుట్టినరోజు కావడంతో పోతవరం వెళ్లి వేడుకలు చేసుకొని తిరిగి ఇంటికి వచ్చారు. రాత్రివేళ ఇంట్లో కొత్త బల్బ్ పెడుతుండగా సంజయ్ షాక్‌కు గురై చనిపోయాడు. కాగా తేజ ప్రస్తుతం గర్భిణి.

Similar News

News October 27, 2025

ప.గో: మొంథా’ తుఫాన్.. నేటి పీజీఆర్ఎస్ రద్దు

image

‘మొంథా’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండల, డివిజన్, జిల్లా స్థాయిలో రద్దు చేసినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ‘మొంథా’ తుఫాన్ కారణంగా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.

News October 26, 2025

ప.గో.: కలెక్టర్, జేసీతో సమావేశమైన ప్రసన్న వెంకటేశ్

image

మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాకు కేటాయించిన ప్రత్యేక పర్యవేక్షణ అధికారి వి. ప్రసన్న వెంకటేశ్ ఆదివారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్‌తో ఆయన సమావేశమయ్యారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు, ముందస్తుగా తీసుకున్న చర్యలపై సమీక్షించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

News October 26, 2025

ప.గో: రెండు రోజలు విద్యాసంస్థలకు సెలవులు

image

‘మొంథా’ తుఫాను నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఈ నెల 27, 28 తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కళింగపట్నం, కాకినాడ మధ్య ఈ నెల 27న తుఫాను తీరం దాటుతున్నందున ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.