News July 15, 2024
ఏలూరు: ఘోరం.. పసికందును చంపిన CRPF కానిస్టేబుల్

ఏలూరు జిల్లాలో ఘోరం జరిగింది. లింగపాలెం మండలం పాశ్చానగరంలో CRPF కానిస్టేబుల్ సీహెచ్.బాలాజీ 2 నెలల పసిబాబును హతమార్చాడు. పాత కేసు విషయంలో సోమవారం ఏలూరు కోర్టుకు వచ్చిన బాలాజీ.. అక్కడ భార్య, ఆమె తండ్రిని చితకబాదాడు. అనంతరం పాశ్చానగరంలోని ఇంటికెళ్లి మరదలు, అత్తను తీవ్రంగా కొట్టి, మరదలి 2 నెలల బాబు పీక నులుమి చంపాడు. దీంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. ధర్మాజీగూడెం పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 10, 2026
పాలకొల్లు ఆసుపత్రికి మహర్దశ

పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం మంత్రి నిమ్మల రామానాయుడు ఆయుర్వేద ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. రూ.12.50 కోట్లతో ఆసుపత్రిని 100 బెడ్లుగా అభివృద్ధి చేశామని, రూ.కోటితో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. బ్యూటిఫికేషన్ కోసం మరో రూ.1.20 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
News January 10, 2026
ప.గో: రైల్వేస్టేషన్కు దారి అడిగి.. మెడలో గొలుసు లాగారు!

నరసాపురం రోడ్డులో శుక్రవారం దారుణ ఘటన జరిగింది. థామస్ బ్రిడ్జి సమీపంలో ఓ వృద్ధురాలు నడిచి వెళ్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు రైల్వేస్టేషన్ దారి అడిగారు. ఆమె వివరిస్తుండగా మెడలోని బంగారు ఆభరణాలు లాక్కొనే ప్రయత్నం చేశారు. బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో గొలుసు తెగి కొంతభాగం వారి చేతికి చిక్కింది. దుండగులు అక్కడి నుంచి పరారయ్యాడు.
News January 9, 2026
ప.గో: మద్యం తాగి దొరికితే రూ.10 వేల జరిమానా!

నరసాపురంలో మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి కోర్టు భారీ జరిమానా విధించింది. చలవపేటకు చెందిన ఎన్. శ్రీను మంగళవారం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు దొరికాడు. నిందితుడిని గురువారం అడిషనల్ సివిల్ జడ్జి ఎస్. రాజ్యలక్ష్మి ఎదుట హాజరుపరచగా, ఆమె రూ.10 వేల అపరాధ రుసుము విధించినట్లు టౌన్ ఎస్ఐ జయలక్ష్మి తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తామని ఆమె హెచ్చరించారు.


