News March 22, 2024
ఏలూరు చరిత్రలో మహిళ MLA లేరు

ఏలూరు నియోజకవర్గానికి 1952 నుంచి 2019 వరకు 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాగా ఇప్పటివరకు గెలిచిన MLAలలో ఒక్కరు కూడా మహిళలు లేరు. 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‘ఐ’ తరఫున మాగంటి వరలక్ష్మి బరిలో ఉన్నప్పటికీ ఆమెపై టీడీపీ అభ్యర్థి మరడాని రంగారావు 9247 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో సైతం ప్రధాన పార్టీల నుంచి పురుషులే బరిలో ఉన్నారు.
Similar News
News December 8, 2025
ప.గో: బాలికలపై టీచర్ లైంగిక వేధింపులు..!

విద్యార్థినులను ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భీమవరం మండలం గొల్లవానితిప్ప ఉన్నత పాఠశాల బాలికలను మ్యాథ్స్ టీచర్ లైంగికంగా వేధించినట్లు తెలియడంతో తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా నిర్వహించిన PTMలో తల్లిదండ్రులు అధికారులకు వివరించారు. చట్టపరంగా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
News December 7, 2025
HIV బాధితుల పట్ల వివక్ష చూపొద్దు: మంత్రి నిమ్మల

2030 నాటికి HIV రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తునట్లు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో HIV బాధితులకు చేయూత కార్యక్రమంలో ఆదివారం మంత్రి పాల్గొన్నారు. HIV బాధితులకు పౌష్టికాహారం, నిత్యవసర సరుకుల బ్యాగులను మంత్రి పంపిణీ చేసారు. సమాజంలో HIV బాధితుల పట్ల మానవత్వం, ప్రేమానురాగాలతో మెలగాలని, వారి పట్ల వివక్ష చూపవద్దని కోరారు.
News December 7, 2025
భీమవరం ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్

భీమవరం ఏరియా ఆసుపత్రిలో సుమారు రూ.2 కోట్ల CSR నిధులతో నిర్మించే డయాలసిస్ సెంటర్కు ఆదివారం కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే రామాంజనేయులు, కలెక్టర్ నాగరాణి భూమిపూజ చేశారు. 8 యంత్రాలు, 10 బెడ్లతో ఈ సెంటర్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఇది అందుబాటులోకి వస్తే రోగులకు మెరుగైన వైద్య సేవలు లభించి, దూర ప్రాంతాలకు వెళ్లే కష్టం తప్పుతుందని వారు పేర్కొన్నారు.


