News March 22, 2024
ఏలూరు చరిత్రలో మహిళ MLA లేరు

ఏలూరు నియోజకవర్గానికి 1952 నుంచి 2019 వరకు 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాగా ఇప్పటివరకు గెలిచిన MLAలలో ఒక్కరు కూడా మహిళలు లేరు. 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‘ఐ’ తరఫున మాగంటి వరలక్ష్మి బరిలో ఉన్నప్పటికీ ఆమెపై టీడీపీ అభ్యర్థి మరడాని రంగారావు 9247 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో సైతం ప్రధాన పార్టీల నుంచి పురుషులే బరిలో ఉన్నారు.
Similar News
News February 12, 2025
ఓఎన్‌జీసి ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

దేశాభివృద్ధికి చమురు గ్యాస్ ఉత్పత్తులను వెలికి తీయడం ఎంత ముఖ్యమో, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలకు ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవడం అంతే ముఖ్యమని కలెక్టర్ నాగరాణి ఓఎన్జీసి ప్రతినిధులకు సూచించారు. మంగళవారం నాగిడిపాలెం తుఫాను పునరావాస కేంద్రం ఖాళీ ప్రదేశంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు. కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
News February 11, 2025
వేల్పూరులో బర్డ్ ఫ్లూ నిర్ధారణ: జిల్లా కలెక్టర్

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుండడంతో జిల్లా కలెక్టర్ నాగరాణి మంగళవారం అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. తణుకు మండలం వేల్పూరులోని కృష్ణానంద పౌల్ట్రీ ఫామ్ లో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు చెప్పారు. వేల్పూరు నుంచి పది కిలోమీటర్ల వరకు అలర్ట్ జోన్ ప్రకటించారు. చికెన్, కోడిగుడ్లు అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. అన్ని షాపులను మూసివేయాలని సూచించారు.
News February 11, 2025
ఆత్మహత్య చేసుకున్న తణుకు ఎస్సై కుటుంబానికి స్నేహితుల అండ

ఇటీవల రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ మూర్తి కుటుంబానికి ఆయన స్నేహితులు రూ. 45.68 లక్షల సాయం చేశారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి ఇటీవల తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆయన స్నేహితులు కలిసి రూ. 45.68 లక్షల ఆర్థిక సహాయాన్ని మూర్తి భార్య విజయకు చెక్కు రూపంలో సోమవారం అందజేశారు.