News July 28, 2024

ఏలూరు: చిన్నారిపై అత్యాచారం.. UPDATE

image

ఏలూరు జిల్లా కుక్కునూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండో తరగతి చదువుతున్న బాలికపై <<13714303>>అత్యాచారం <<>>చేసిన నిందితుడు వెంకటేశ్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. SI రామకృష్ణ తెలిపిన వివరాలు.. ఈ నెల 25న స్కూల్ నుంచి వస్తున్న చిన్నారిని పునుగులు కొనిస్తానని స్కూటర్‌పై తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి 24 గంటల్లో అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News October 31, 2025

నరసాపురం: సినీ గాయకుడు రాజు కన్నుమూత

image

నరసాపురం మండలం చిట్టవరానికి చెందిన ప్రముఖ సినీ గాయకుడు గోగులమండల రాజు (42) శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు. ‘పాడుతా తీయగా’ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆయన, హీరో వెంకటేశ్ నటించిన ‘లక్ష్మి’ చిత్రంలోని “తార తలుకు తార” పాటతో మంచి గుర్తింపు పొందారు. ఆయన అంత్యక్రియలు శనివారం చిట్టవరంలో జరగనున్నాయి.

News October 31, 2025

ప.గో: డెడ్ బాడీ పార్సిల్ కేసులో రాష్ట్రానికి 4 అవార్డులు

image

ఉండి (M) యండగండి డెడ్ బాడీ పార్సిల్ కేసు చేధనలో రాష్ట్రానికి 4 అవార్డులు దక్కాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా విజయవాడలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ నయీమ్ అస్మితో పాటు మరో ముగ్గురు అధికారులు అవార్డులు అందుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ , కేంద్రీయ గృహమంత్రి దక్షత పదక్‌లో అవార్డులు ప్రకటించారు. అవార్డులు అందుకున్న నలుగురు అధికారులు ప్రశంసలు అందుకుంటున్నారు.

News October 31, 2025

తుఫాను తాకిడికి 91 గ్రామాలు ప్రభావితం: కలెక్టర్

image

తుఫాను కారణంగా జిల్లాలో జరిగిన ప్రాథమిక నష్టం అంచనాలను కలెక్టర్ నాగరాణి గురువారం వివరించారు. ఈ తుఫాను తాకిడికి 91 గ్రామాలు ప్రభావితం అయ్యాయని, 13 గ్రామాలు, 6 పట్టణాలు నీట మునిగాయని తెలిపారు. మొత్తం 13,431.83 హెక్టార్లలో వ్యవసాయం, 299.87 హెక్టార్లలో ఉద్యానవన పంటలు, 93 ఇళ్లు దెబ్బతిన్నాయని ఆమె పేర్కొన్నారు.