News March 8, 2025

ఏలూరు: చేపల చెరువులకు నీరు ఇవ్వాలని వినతి

image

వేసవి నేపథ్యంలో నీటి కొరత ఉందని.. చేపల చెరువులకు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరారు. ఈ మేరకు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం కలిశారు. వినతిపత్రం అందజేశారు. నీటి కొరత కారణంగా జిల్లాలో చేపలు సాగు చేస్తున్న తాము ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని వాపోయారు.

Similar News

News November 21, 2025

వనపర్తి: ‘ఉల్లంఘించిన రైస్ మిల్లులపై కేసులు’

image

వనపర్తి జిల్లాలో మొత్తం 173 రైస్ మిల్లులు ఉండగా ఈ ఏడాది 81 మిల్లులకు ధాన్యం కేటాయించేందుకు అనుమతులు ఇచ్చామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మిగిలిన మిల్లులు సకాలంలో ధాన్యం అప్పగించనందున ధాన్యం కేటాయించలేదని, 39 మిల్లులపై కేసులు సైతం నమోదు చేశామన్నారు. ధాన్యం కేటాయించాలంటే ముందుగా కనీసం 10% బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుందని.. ఇప్పటివరకు కేవలం 46 మిల్లులు మాత్రమే గ్యారంటీలు ఇచ్చినట్లు తెలిపారు.

News November 21, 2025

గులాం రసూల్ సేవలు మరువలేనివని: పల్లె శేఖర్ రెడ్డి

image

పేదల ఆశాజ్యోతి గులాం రసూల్ సేవలు మరువలేనివని సీపీఐ యాదాద్రి జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె శేఖర్ రెడ్డి అన్నారు. రసూల్ 10వ వర్ధంతి సందర్భంగా చౌటుప్పల్ సీపీఐ కార్యాలయంలో నివాళులర్పించారు. రాచకొండ ఫైరింగ్ రేంజ్ వ్యతిరేక ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని, గిరిజనులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. జడ్పీటీసీ, MPTCగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన నాయకుడు అన్నారు.

News November 21, 2025

రాజమండ్రి: ఆర్టీసీకి రూ.32 లక్షల ఆదాయం

image

కార్తీక మాసం నేపథ్యంలో ఆర్టీసీకి కాసుల పంట పండింది. కార్తీకం వేళ జిల్లాలో ఉన్న డిపోల నుంచి 36 బస్సులు నడపడం ద్వారా రూ.32 లక్షల ఆదాయం వచ్చిందని డీపీటీవో మూర్తి శుక్రవారం తెలిపారు. శబరిమలకు 8 బస్సులు, పంచారామాలకు 13 బస్సులు, ఏకాదశి రుద్రులు, నవ నందులు, శివ కేశవ దర్శిని, కోనసీమ స్పెషల్‌గా 15 బస్సులు నడిపామన్నారు. అయ్యప్ప భక్తుల కోసం, అలాగే ధనుర్మాసంలో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు.