News March 8, 2025

ఏలూరు: చేపల చెరువులకు నీరు ఇవ్వాలని వినతి

image

వేసవి నేపథ్యంలో నీటి కొరత ఉందని.. చేపల చెరువులకు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరారు. ఈ మేరకు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం కలిశారు. వినతిపత్రం అందజేశారు. నీటి కొరత కారణంగా జిల్లాలో చేపలు సాగు చేస్తున్న తాము ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని వాపోయారు.

Similar News

News March 15, 2026

ప.గో జిల్లాలో అక్షరాంధ్ర పరీక్షకు 99.9 శాతం హాజరు

image

జిల్లాలో అక్షరాంధ్ర లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్‌మెంట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మొత్తం 60,865 మంది అభ్యర్థులకు గాను 60,829 మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాను నూరు శాతం అక్షరాస్యత దిశగా తీర్చిదిద్దేందుకు అధికారులు అంకితభావంతో కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

News March 15, 2026

అకౌంట్లలోకి రూ.6,000.. మొదట వీరికే!

image

TG: అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ఈ నెల 22న ‘రైతుభరోసా’ నిధులు <<19391741>>విడుదల<<>> చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా ఎకరం వరకు ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.6,000 చొప్పున జమ చేయనుంది. ఇందుకోసం సర్కార్ రూ.3,590 కోట్లు వెచ్చించనుంది. ఇక 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత డబ్బులు రిలీజ్ చేయనుంది. కాగా రైతుభరోసా ద్వారా ఏడాదికి రూ.12వేలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.

News March 15, 2026

పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ సూచనలు

image

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని కలెక్టర్ రాజాబాబు సూచించారు. ముఖ్యంగా సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఓఎంఆర్ షీట్‌లోని సబ్జెక్టు కోడ్, రూమ్ నెంబర్ వంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో పరీక్షలు రాయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.