News September 23, 2024

ఏలూరు: జలపాతంలో గల్లంతైన రెండు మృతదేహాలు లభ్యం

image

మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం వద్ద వాగులో ఏలూరు ఆశ్రమ్ కళాశాల మెడికల్ విద్యార్థులు ముగ్గురు ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. ఇద్దరి మృతదేహాలు సోమవారం ఉదయం బయటపడ్డాయి. వాటర్ ఫాల్స్ దిగువన ఇద్దరి యువతుల మృతదేహాలు దొరికాయి. వీరిని కె.సౌమ్య, అమృతలుగా గుర్తించారు. మరొక విద్యార్థి ఆచూకీ తెలియాల్సి ఉంది.

Similar News

News November 16, 2024

అసెంబ్లీలో RRRతో విశాఖ ఎమ్మెల్యే వాగ్వాదం

image

ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ RRR, విశాఖ MLAకి మధ్య వాగ్వాదం జరిగింది. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుపై విష్ణుకుమార్ రాజు మాట్లాడుతుండగా టైం అయిపోందని RRR బెల్ కొట్టారు. ‘మీరు అప్పుడే బెల్ కొడితే ఎలా అధ్యక్షా. గంట పర్మిషన్ తీసుకున్నా’ అని MLA చెప్పగా.. ‘అందరికీ కలిపి ఒక గంట సమయం ఇచ్చారు. మీకు ఒక్కరికే కాదు. ఇంకా 25 మంది మాట్లాడాలి. త్వరగా ముగించండి’ అంటూ మరికాస్త సమయం ఇచ్చారు.

News November 16, 2024

జంగారెడ్డిగూడెం పోలీసుల కస్టడీలో బోరుగడ్డ అనిల్

image

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్‌ను జంగారెడ్డిగూడెం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతను గుంటూరులో ఓ వ్యక్తిని రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించిన కేసులో రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే అదే సమయంలో JRGలోని వేలురుపాడు పోలీస్ స్టేషన్‌లో అతనిపై మరోకేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో శుక్రవారం జంగారెడ్డిగూడెం పోలీసులు రాజమండ్రి నుంచి రెండురోజుల కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు.

News November 16, 2024

పోలవరం 45.72 మీటర్ల ఎత్తులోనే నిర్మించాలి: నారాయణ

image

ఏలూరు జిల్లా స్ఫూర్తి భవనంలో శుక్రవారం కొల్లేరు పరిరక్షణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులోనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే రిజర్వాయర్‌గా మారే ప్రమాదం ఉందని, విద్యుత్తు ఉత్పత్తిలో ఆటకం ఏర్పడుతుందన్నారు. రుషికొండ కట్టడాల్ని పర్యాటకరంగానికి వినియోగిస్తే ఆదాయం వస్తుందన్నారు.