News May 25, 2024
ఏలూరు: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

ఏలూరు జిల్లా స్థానిక ఆశ్రమం జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు వైపు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్ను బొలెరో వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కార్లో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 14, 2025
రోడ్డు ప్రమాదంలో పాలకొల్లు వాసి మృతి

రాజమండ్రి మోరంపూడి ఫ్లై ఓవర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకొల్లు(M) గొల్లవాని చెరువుకు చెందిన సాయినరేశ్ (30) మృతి చెందాడు. గుంటూరు జిల్లాకు చెందిన రమేశ్ తో బొమ్మూరు వైపు వెళ్తుండగా.. వెనుకనుంచి కారు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని గురువారం కుటుంబీకులకు బొమ్మూరు పోలీసులు అప్పగించి, కేసు నమోదు చేశారు. నరేశ్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.
News March 13, 2025
భీమవరం: జనసేన సభకు వెళ్లే వారికి ప్రత్యేక రూట్లు

పశ్చిమ గోదావరి, గుంటూరు, తెనాలి, కృష్ణ, జిల్లాల నుంచి వెళ్లే వాహనాలు తూరంగి బ్రిడ్జి నుంచి ఉప్పలంక బైపాస్ చీడిగ, ఇంద్రపాలెం, కెనాల్ రోడ్డు, సామర్లకోట మూడు లైట్లు జంక్షన్, మూత్తా గోపాలకృష్ణ ఫ్లైఓవర్, అచ్చంపేట జంక్షన్ మీదుగా చిత్రాడ సభ ప్రాంగణానికి చేరుకొవాలన్నారు. ఆయా మార్గాల్లో అభిమానులకు భోజనాలు, మజ్జిగ వంటి సదుపాయాలను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు.
News March 13, 2025
భీమవరంలో బాంబు బెందిరింపు.. పలు కోణాల్లో దర్యాప్తు

భీమవరం విష్ణు కళాశాలలో బుధవారం బాంబు పెట్టామన్న ఈ మెయిల్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి నుంచి మెయిల్ వచ్చిననట్లు పోలీసులు గుర్తించారు. పార్లమెంటు దాడి ఘటనలో సూత్రధారి అప్జల్ గురుకు శిక్ష విధించినందుకు నిరసనగా కళాశాలలో బాంబు పెట్టినట్లు ఈ మెయిల్లో పేర్కొన్నాడు. అది అతడి నుంచి వచ్చిందా? లేదా మరోకరు పంపించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని DSP జయసూర్య తెలిపారు.