News October 6, 2024
ఏలూరు: జాతీయ రహదారి సమస్యలు పరిష్కరిస్తా: MP
ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని 216-ఎ- జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల్లో నెలకొన్న రహదారి సమస్యలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటానని ఏలూరు MP పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. శనివారం ఆయన భీమడోలులోని టీడీపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఉన్నారు.
Similar News
News November 12, 2024
ప.గో: వివాహితపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్
గోపాలపురం మండలంలో వివాహితపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు SI సతీశ్ కుమార్ మంగళవారం తెలిపారు. SI వివరాల మేరకు..ఈ నెల 9న సదరు మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండటంతో అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. దీనిపై సోమవారం రాత్రి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. నిందుతుడిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.
News November 12, 2024
ప.గో. జిల్లాలో రేంజ్ IG పర్యటన
ఏలూరు రేంజ్ IG అశోక్ కుమార్ సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు రూరల్ సర్కిల్, మొగల్తూరు పోలీస్ స్టేషన్లలో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ వార్షిక తనిఖీల్లో పోలీస్ స్టేషన్లో నిర్వహించే పలు రికార్డులను పరిశీలించి, స్టేషన్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం కేసులకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు.
News November 11, 2024
ఏలూరు జిల్లాలో మహిళల కోసం అభయ దళం
ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ జిల్లాలో మహిళల కోసం నూతనంగా అభయ దళం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. మహిళల కోసం 95503 51100 టోల్ ఫ్రీ వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆపదలో ఉన్న సమాచారం అందుకున్న వెంటనే డయల్ 112కు సమాచారం అందించిన 10 నిమిషాల్లో పోలీసులు మీకు భద్రతను కల్పిస్తూ, మహిళలపై వేధింపులు చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.