News March 25, 2025
ఏలూరు జిల్లాకు అలర్ట్..!

ఏలూరు జిల్లాలో వాతావరణం మారుతోంది. రానున్న రెండు రోజుల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో వేడిగాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ వేలేరుపాడులో 40.1, పోలవరంలో 39.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. 26న పోలవరంలో 39.4, వేలేరుపాడులో 40 డిగ్రీల ఎండ కాస్తుందని తెలిపింది.
Similar News
News October 29, 2025
ఏసీబీకి చిక్కిన యాదాద్రి దేవాలయ అధికారి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పనిచేస్తున్న అధికారి ఉప్పల్లో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టు పడ్డాడు. ఓ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.1,90,000 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఆలయంలో ఎలక్ట్రిసిటీ విభాగంలో పనిచేస్తున్న రామారావుకు సంబంధించిన బంధువుల ఇండ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.
News October 29, 2025
రేపు యథావిధిగా పాఠశాలలు: నంద్యాల డీఈవో

నంద్యాల కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలలు రేపటి నుంచి యథావిధిగా పనిచేయాలని డీఈవో జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు ఉంటే గురువారం సెలవు ఇవ్వాలని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
News October 29, 2025
తొర్రూరు-నర్సంపేట రాకపోకలు బంద్

తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో తొర్రూరు- నర్సంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అమ్మపురం- బొత్తలతండా సమీపంలోని కల్వర్టులో నీటి ప్రవాహం పెరిగి ప్రమాద స్థాయికి చేరుకుంది. అప్రమత్తమైన పోలీసులు రహదారికి రెండు వైపులా ట్రాక్టర్లను ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. గుర్తూరు ఈదులవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను మళ్లిస్తున్నారు.


