News April 12, 2025

ఏలూరు జిల్లాకు 9వ స్థానం

image

ఇంటర్ ఫలితాల్లో ఏలూరు జిల్లా నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 12,086 మంది పరీక్షలు రాయగా 10,376 మంది పాసయ్యారు. 86 శాతం పాస్ పర్సంటేజీతో ఏలూరు జిల్లా రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 15,288 మందికి 10,842 మంది పాసయ్యారు. 71 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 10వ స్థానంలో ఏలూరు జిల్లా నిలిచింది.

Similar News

News January 6, 2026

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో పోస్టులు

image

<>CSIR<<>>-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ 14 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. డిప్లొమా, గ్రాడ్యుయేట్ అర్హత గలవారు NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవాలి. జనవరి 8న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. డిప్లొమా అప్రెంటిస్‌లకు 18-24ఏళ్ల మధ్య, డిగ్రీ అప్రెంటిస్‌లకు 21 నుంచి 26ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్‌ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://www.nio.res.in

News January 6, 2026

గ్యాస్ లీక్.. రూ.వందల కోట్ల నష్టం?

image

AP: అంబేడ్కర్ కోనసీమ(D) ఇరుసుమండలోని ONGC డ్రిల్ సైట్ నుంచి <<18770706>>లీకవుతున్న<<>> గ్యాస్‌ను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటికీ 30 మీటర్ల మేర మంటలు ఎగిసిపడుతుండటంతో నిరంతరం నీటిని వెదజల్లుతున్నారు. బ్లోఅవుట్ ప్రాంతంలో 50 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో రూ.వందల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. కాసేపట్లో ఢిల్లీ, ముంబై నుంచి స్పెషల్ టీమ్స్ చేరుకోనున్నాయి.

News January 6, 2026

8వ రోజుకు చేరుకున్న వైకుంఠ ద్వార దర్శనాలు

image

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం 8వ రోజుకు చేరుకున్నాయి. మరో రెండు రోజుల బుధవారం, గురువారం రాత్రి వరకు సాగనున్నాయి. ఇప్పటివరకు లక్కి డిప్‌లో టోకెన్లు పొందిన స్థానికులు ఇవాళ నుంచి మూడు రోజులు దర్శనం చేసుకోనున్నారు. 7రోజు పాటు వైకుంఠ ద్వార దర్శనం 5,42,057 మంది భక్తులు చేసుకున్నారు.