News April 12, 2025
ఏలూరు జిల్లాకు 9వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో ఏలూరు జిల్లా నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 12,086 మంది పరీక్షలు రాయగా 10,376 మంది పాసయ్యారు. 86 శాతం పాస్ పర్సంటేజీతో ఏలూరు జిల్లా రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 15,288 మందికి 10,842 మంది పాసయ్యారు. 71 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 10వ స్థానంలో ఏలూరు జిల్లా నిలిచింది.
Similar News
News April 22, 2025
మెదక్: యువతి అదృశ్యం.. కేసు నమోదు

ఆసుపత్రికి వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన ఘటన శివంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువతి (18) ఓ పరిశ్రమలో కూలీగా పనిచేస్తుంది. ఈనెల 19న తూప్రాన్ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 22, 2025
S.N పాడు: అధ్యాపక పోస్టులకు నేడే ఇంటర్వ్యూలు

సంతనూతలపాడు మండలం మైనంపాడు డైట్ కళాశాలలో అధ్యాపక పోస్టులకు నేడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు డిప్యూటేషన్ పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
News April 22, 2025
ప్రకాశం: విద్యార్థుల కోసం ఇంటి బాట పట్టిన ఉపాధ్యాయులు

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం ఇంటి బాట పడుతున్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఉపాధ్యాయులు తమ పరిధిలోని గ్రామాలలో తిరుగుతూ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం అయింది.