News September 6, 2024

ఏలూరు జిల్లాలో కి‘లేడీ’.. విలాసాల కోసం చోరీల బాట

image

ఏలూరు జిల్లా భీమడోలులో ఓ కి‘లేడీ’ని పోలీసులు అరెస్ట్ చేశారు. DSP శ్రావణ్ వివరాల ప్రకారం.. గుండుగొలనులోని YSR కాలనీకి చెందిన శ్రీదేవి విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో దొంగతనాల బాట పట్టింది. కాలనీలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతోంది. దీనిపై ఫిర్యాదులు అందగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. రూ 4,47,000/- విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

Similar News

News October 11, 2024

నిడమర్రు: రూ.1.2కోట్లతో ధనలక్ష్మి అమ్మవారు అలంకరణ

image

నిడమర్రు మండలం పెదనిండ్రకొలను తూర్పు వెలమ పేటలో వెలసిన దుర్గమ్మను శుక్రవారం ధనలక్ష్మి దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రూ.1.02 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు, 140 కాసుల బంగారు నగలతో నిర్వహకులు విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి దేవి అలంకరణలోని అమ్మవారిని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు.

News October 11, 2024

పెదవేగి: కుటుంబం మరణం తట్టుకోలేక భార్య సూసైడ్

image

పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం పందెం కోడికి ఈత నేర్పుతూ.. ప్రమాదవశాత్తు తండ్రీకుమారులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా కుటుంబంలో అందరినీ కోల్పోవడం జీర్ణించుకోలేక తల్లి కూడా శుక్రవారం ఆత్మహత్య చేసుకుని కన్నుమూసింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News October 11, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో 8,770 టెండర్లు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది. మొత్తం జిల్లాలో 175 దుకాణాలకు గాను ఇప్పటికి 4495 దరఖాస్తులు అందాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సుమారు రూ.90 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. అలాగే ఏలూరు జిల్లాలో 144 మద్యం షాపులకు 4275 దరఖాస్తులు వచ్చాయన్నారు.