News February 2, 2025

ఏలూరు జిల్లాలో క్యాంప్ రాజకీయాలు

image

నూజివీడు మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక సోమవారం జరగనుంది. మొత్తం 32 వార్డులుండగా.. YCP 25, TDP 8 చోట్ల గెలిచింది. ఎలక్షన్ ముందు ఓ కౌన్సిలర్ TDP గూటికి చేరారు. తాజాగా మరికొందరు YCPని వీడుతారని తెలుస్తోంది. ఈక్రమంలో మాజీ MLA ప్రతాప అప్పారావు అప్రమత్తమై YCP కౌన్సిలర్లను క్యాంపునకు పంపినట్లు తెలుస్తోంది. వైస్ ఛైర్మన్ పదవి TDPకి దక్కేలా మంత్రి పార్థసారథి తన మార్క్ రాజకీయం చేస్తున్నారని నూజివీడులో టాక్.

Similar News

News November 15, 2025

HYD: నేషనల్ ప్రెస్ డే.. జర్నలిస్టులకు ఆహ్వానం..!

image

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నవంబర్ 16న నాంపల్లి తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. సమాచార, ప్రజాసంబంధాల శాఖ, మీడియా అకాడమీ కలిసి నిర్వహిస్తున్న ఈ వేడుకకు ఉదయం 10:30కి జర్నలిస్టులు హాజరవ్వాలని IPR అధికారులు కోరారు. I&PR ప్రత్యేక కమిషనర్ ముఖ్య అతిథిగా, సీనియర్ ఎడిటర్ దేవులపల్లి అమర్ సహా పలువురు మీడియా ప్రముఖులు పాల్గొంటారు.

News November 15, 2025

దేశ‌మంతా గ‌ర్వంగా ఫీల‌వుతుంది: మ‌హేశ్ బాబు

image

వారణాసి సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మహేశ్ బాబు తెలిపారు. ‘ఈ సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డాలో అంత క‌ష్ట‌ప‌డ‌తాను. అంద‌రూ గ‌ర్వప‌డేలా చేస్తాను. ముఖ్యంగా రాజ‌మౌళిని. ఇది విడుద‌లైన త‌ర‌వాత దేశ‌మంతా గ‌ర్వంగా ఫీల‌వుతుంది’ అని అన్నారు. ‘పౌరాణికం చేయ‌మ‌ని నాన్న‌ అడుగుతుండేవారు. ఆయ‌న మాట‌లు ఎప్పుడూ విన‌లేదు. ఇప్పుడు ఆయ‌న నా మాట‌లు వింటుంటారు’ అని గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌‌లో మాట్లాడారు.

News November 15, 2025

HYD: హైడ్రాకు హైకోర్టు వార్నింగ్..!

image

హైకోర్టు HYDలో సరస్సుల పనుల సందర్భంగా కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు HYDRAA, కమిషనర్ ఎ.వి.రఘునాథ్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపట్టారని ప్రశ్నించిన జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి, సరస్సుల సంరక్షణ పేరుతో యాదృచ్ఛిక చర్యలు అనుచితమని వ్యాఖ్యానించారు. ఖానామెట్‌లోని తమ్మిడి కుంట ట్యాంక్ సమీపంలో స్టేటస్ క్వో ఆదేశాల ఉల్లంఘనల పై విచారణ జరుగుతోంది.