News February 2, 2025
ఏలూరు జిల్లాలో క్యాంప్ రాజకీయాలు

నూజివీడు మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక సోమవారం జరగనుంది. మొత్తం 32 వార్డులుండగా.. YCP 25, TDP 8 చోట్ల గెలిచింది. ఎలక్షన్ ముందు ఓ కౌన్సిలర్ TDP గూటికి చేరారు. తాజాగా మరికొందరు YCPని వీడుతారని తెలుస్తోంది. ఈక్రమంలో మాజీ MLA ప్రతాప అప్పారావు అప్రమత్తమై YCP కౌన్సిలర్లను క్యాంపునకు పంపినట్లు తెలుస్తోంది. వైస్ ఛైర్మన్ పదవి TDPకి దక్కేలా మంత్రి పార్థసారథి తన మార్క్ రాజకీయం చేస్తున్నారని నూజివీడులో టాక్.
Similar News
News February 15, 2025
‘విశ్వంభర’లో మెగా హీరో?

చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ మూవీలో మెగా హీరో సాయి దుర్గతేజ్ అతిథి పాత్రలో కనిపిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇవాళ షూట్‌లో ఆయన పాల్గొన్నారని తెలిపాయి. మరోవైపు చిరు ఇంట్రో సాంగ్ షూట్ జరుగుతుందని చిత్రయూనిట్ పేర్కొంది. దీంతో ఆయన సాంగ్‌లో కనిపిస్తారని టాక్. ఇప్పటికే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలు చిరంజీవి సినిమాలోని సాంగ్స్‌లో కనిపించిన సంగతి తెలిసిందే.
News February 15, 2025
NLG: జిల్లాలో బర్డ్ ఫ్లూ భయం.. తగ్గిన చికెన్ అమ్మకాలు

బర్డ్ ఫ్లూ భయంతో జిల్లా వ్యాప్తంగా చికెన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. నల్గొండ జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ లేనప్పటికీ చౌటుప్పల్, అక్కంపల్లి, చిట్యాల, సూర్యాపేట తదితర ప్రాంతాలలో వివిధ వ్యాధులతో కోళ్ల ఫారాలలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో ప్రజలు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినడం తగ్గించారు. చికెన్ రేట్లు తగ్గుముఖం పడుతున్నప్పటికీ అమ్మకాలు సరిగ్గా లేవని వ్యాపారస్థులు పేర్కొంటున్నారు.
News February 15, 2025
ఎంతో చేయాలని ఉంది.. కానీ గల్లా పెట్టె సహకరించట్లేదు: సీఎం

AP: అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఎన్నో పథకాలను అమలు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. పింఛన్ల పెంపు, మహిళలకు ఉచిత సిలిండర్లు, అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో సంపద పెరగలేదని, రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ఇంకా ఎంతో చేయాలని ఉందని, కానీ గల్లా పెట్టె సహకరించడం లేదన్నారు.