News February 19, 2025
ఏలూరు: జిల్లాలో జీబీఎస్ వైరస్ కలకలం

ఏలూరు జిల్లాలో జీబీఎస్ వైరస్ కలకలం రేపింది. ఉంగుటూరు మండలానికి చెందిన ఓ మహిళ (30) ఈనెల 18వ తేదీన విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు జీబీఎస్ వైరస్‌గా అధికారులు నిర్ధారించారు. ఆమెను ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 22, 2025
జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌కు ఓటేయండి: సీతక్క

జూబ్లీహిల్స్ పరిధి బోరబండలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున మంత్రి సీతక్క ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ఓటర్లకు సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని చెప్పారు. కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ఉన్నారు.

HYD: పెద్ద సదర్ ఉత్సవం.. నారాయణగూడలో ట్రాఫిక్ ఆంక్షలు

HYD నారాయణగూడలో అక్టోబర్ 22 రాత్రి నుంచి 23 ఉదయం వరకు పెద్ద సదర్ ఉత్సవ మేళా జరగనుంది. ఈ మేరకు రామ్‌కోటి, లింగంపల్లి, నారాయణగూడ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా అధికారులు మళ్లించనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ విజ్ఞప్తి చేశారు.