News October 15, 2024

ఏలూరు జిల్లాలో టెట్ పరీక్షలకు 48 మంది గైర్హాజర్

image

ఏలూరు జిల్లాలో నిర్వహించే టెట్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయని విద్యాశాఖ అధికారి అబ్రహం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 186 మంది విద్యార్థులకు 158 మంది, మధ్యాహ్నం 186 మందికి 166 మంది హాజరయ్యారని తెలిపారు. ఉదయం 28 మంది, మధ్యాహ్నం 20 మంది గైర్హాజరయ్యారని చెప్పారు.

Similar News

News November 9, 2025

తణుకు: బీసీ వసతి గృహంలో కలెక్టర్ తనిఖీలు

image

తణుకులోని పాత ఊరు బాలికల బీసీ హాస్టల్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థినులతో మాట్లాడి, అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, రుచిగా ఉందా అని ఆరా తీశారు. డైనింగ్ హాల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News November 9, 2025

ఇరగవరం: విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

image

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యపాలెం వద్ద ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరి కోత మిషన్‌ను వ్యాన్‌లో తరలిస్తుండగా, 11 కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. ఈ ప్రమాదంలో ప.గో జిల్లా ఇరగవరం మండలానికి చెందిన కె. సింహాద్రి అప్పన్న (58), జి. సందీప్ (26) విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతితో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News November 9, 2025

భీమవరం: భక్త కనకదాసు జయంతి

image

భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు శ్రీ భక్త కనకదాస జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త అని అన్నారు.