News October 19, 2024

ఏలూరు జిల్లాలో నలుగురు పోలీసులు సస్పెండ్ 

image

నిడదవోలు సీఐ శ్రీనివాసరావు, పెరవలి ఎస్ఐ అప్పారావు, పెరవలి స్టేషన్ రైటర్, పెరవలి కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పెరవలి మండలం ముక్కామల గ్రామ పరిధిలో సెప్టెంబర్ 8వ తేదీన జరిగిన ఓ పేకాట శిబిరంపై దాడి చేసి కేసులో అవినీతికి పాల్పడ్డారన్నారు. ఆ కేసును తప్పుదోవ పట్టించారనే పలు ఆరోపణలు రావడంతో విచారించి, శాఖా పరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Similar News

News February 24, 2026

BREAKING: భీమవరంలో ACBకి చిక్కిన ఫారెస్ట్ అధికారి

image

భీమవరం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు జరిపిన దాడులు కలకలం రేపాయి. భీమవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేశ్ రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక పనికి సంబంధించి బాధితుడి నుంచి నగదు డిమాండ్ చేయడంతో అధికారులు నిఘా పెట్టి పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

News February 24, 2026

పాలకొల్లు: మళ్లీ ‘ఫ్యాన్’ కిందకే మేకా.. సస్పెన్షన్ ఎత్తివేత?

image

మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తిరిగి వైసీపీ గూటికి చేరనున్నారు. తాడేపల్లిలో పార్టీ అధినేత జగన్‌‌ని ఆయన తన కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 9న జరగనున్న తన కుమారుడి వివాహానికి హాజరుకావాల్సిందిగా జగన్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ భేటీ నేపథ్యంలో శేషుబాబుపై గతంలో ఉన్న సస్పెన్షన్‌ను అధిష్ఠానం ఎత్తివేసినట్లు తెలుస్తోంది.

News February 24, 2026

పీజీఆర్ఎస్‌కు 19 అర్జీలు: ఎస్పీ

image

భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్’ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి 19 అర్జీలను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అందిన ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడబోమని స్పష్టం చేశారు.