News March 21, 2025
ఏలూరు జిల్లాలో నలుగురు మృతి

ఏలూరు జిల్లాలో గురువారం వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెంది ఏలూరుకి చెందిన మల్లేశ్వరరావు(40) ఉరి వేసుకున్నాడు. చింతలపూడిలో రిటైర్డ్ ఉద్యోగి హేమ ప్రకాశ్(65) అనుమానస్పద స్థితిలో చనిపోయారు. ఏలూరు పవర్ పేట రైల్వే స్టేషన్ సమీపంలో కృష్ణా(D) వేల్పూరికి చెందిన రవికుమార్ మృతి చెందాడు. భీమడోలు వద్ద రైలు నుంచి జారిపడి సుబ్బారెడ్డి(69) అనే వ్యక్తి చనిపోయాడు.
Similar News
News November 21, 2025
విశాఖ ‘ఖాకీ’లపై ప్రత్యేక నిఘా..!(1/2)

విశాఖలో దీర్ఘకాలంగా పాతుకుపోయిన కొందరు పోలీసు అధికారులు ఇష్టారీతిన వ్యవహిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులు అవినీతి పోలీసుల పనితీరుపై స్పెషల్ టీంతో నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీపీ దృష్టిలో ఏ అధికారిపై రిమార్క్స్ ఎక్కువ వచ్చాయి? ఎవరి మీద యాక్షన్ ఉంటుంది? అన్న భయం ఖాకీల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తోంది. మీ పరిధిలో పోలీసులు పనితీరుపై కామెంట్ చెయ్యండి.
News November 21, 2025
ప.గో: రూ. 2కోట్లు గోల్ మాల్ ?

తణుకులోని ఓ ప్రైవేటు బ్యాంకులో తాకట్టు బంగారం గోల్‌మాల్ అయిన వ్యవహారం రాజుకుంటోంది. గతంలో ఇక్కడ పనిచేసిన సిబ్బందితో చేతులు కలిపిన తణుకు శాఖ మేనేజర్ ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని సొంత అవసరాలకు వాడుకున్న వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఖాతాదారులు నిలదీయడంతో బ్యాంకు అధికారులు బయట బంగారం కొనుగోలు చేసి ఇచ్చారు. ఇలా సుమారు రూ.2 కోట్లు విలువైన బంగారాన్ని దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది.
News November 21, 2025
MBNR: ప్రయాణికురాలిగా బస్టాండ్‌లో ఎస్పీ పరిశీలన

మహబూబ్ నగర్ జిల్లాలోని ‘ప్రజా భద్రత–పోలీసు బాధ్యత కార్యక్రమం’ కొనసాగుతున్న సందర్భంలో జిల్లా ఎస్పీ డి.జానకి శుక్రవారం మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో సాధారణ మహిళలా నడుచుకుంటూ ప్రత్యక్ష పరిశీలనలు నిర్వహించింది. బస్టాండ్‌లో వేచి ఉన్న బాలికలతో, మహిళలతో వ్యక్తిగతంగా మాట్లాడి, ఎవరి నుండైనా వేధింపులు, అసౌకర్యాలు, అనుమానాస్పద ప్రవర్తన వంటి సమస్యలు ఎదురైతే వెంటనే ధైర్యంగా పోలీసులకు తెలియజేయాలన్నారు.


