News April 25, 2024
ఏలూరు జిల్లాలో నామినేషన్ల వివరాలు

ఏలూరు ఎంపీ స్థానానికి మంగళవారం 3 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉంగుటూరులో 6 సెట్లు, దెందులూరులో 2 సెట్లు, ఏలూరులో 5 సెట్లు, పోలవరంలో 4 సెట్లు, చింతలపూడిలో 2 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి 13 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా, ఉంగుటూరులో 11, దెందులూరులో 10, ఏలూరులో 12, పోలవరంలో 10, చింతలపూడిలో 9 నామినేషన్లు వచ్చాయి.
Similar News
News November 23, 2025
‘రైతన్న.. మీకోసం’ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఈ నెల 24 నుంచి 29 వరకు జరిగే ‘రైతన్న.. మీకోసం’ వారోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం భీమవరం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రతి రైతుకూ అవగాహన కల్పించాలని, శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News November 23, 2025
ప.గో: బొలెరో ఢీకొని యువకుడి మృతి

నరసాపురం హైవేపై జరిగిన ప్రమాదంలో మొగల్తూరుకు చెందిన మన్నే ఫణీంద్ర (21) దుర్మరణం పాలయ్యారు. శనివారం పాలకొల్లు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వెనుక నుంచి వచ్చిన బొలెరో ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఫణీంద్రను మెరుగైన వైద్యం కోసం భీమవరం తరలిస్తుండగా దారిలో మృతి చెందారు. మృతుడి సోదరుడు వాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జయలక్ష్మి తెలిపారు.
News November 23, 2025
ప.గో: వందేళ్ల వేడుకకు వేళాయె..!

ప.గో జిల్లాలో ఈ నెల 23న శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం భీమవరంలో సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులతో ఆమె సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.


