News March 29, 2025

ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*జంగారెడ్డిగూడెంలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి. *అగిరిపల్లి మండలంలో 50 లక్షల తో నిర్మించే సీసీ రోడ్లకు మంత్రి పార్థసారథి శంకుస్థాపన.*జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు తోడ్పాటు నివ్వాలి :కలెక్టర్.*జిల్లావ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. *విశ్వకర్మ కార్పొరేషన్ రుణాలను మంజూరు చేయాలని బ్యాంక్ అధికారులకు సూచించిన మంత్రి. *జంగారెడ్డిగూడెంలో మంత్రి కందుల దుర్గేశ్ పర్యటన.

Similar News

News December 9, 2025

సంగారెడ్డి: నేటి నుంచి వైన్స్ దుకాణాల బంద్

image

జిల్లాలో ఈనెల 11న జరుగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా నేటి సాయంత్రం నుంచి 11వ తేదీ వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్‌లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు సోమవారం తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 9, 2025

ఖమ్మం: సాయంత్రం నుంచి అంతా గప్ చుప్

image

జీపీ మొదటి విడత ప్రచారానికి ఇవాళ సాయంత్రంతో తెర పడనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలో 7 మండలాల్లో 172, కొత్తగూడెం జిల్లాలో 8 మండలాల్లో 159 గ్రామాల్లో ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ పోరులో ఎప్పుడూ పెద్దగా కనిపించని బడా నేతలు సైతం ఈ ఎలక్షన్స్‌ను ప్రతిష్ఠాత్మకంగా భావించి తమ మద్దతు దారుల తరఫున ఓట్లు అభ్యర్థించారు.

News December 9, 2025

సిద్దిపేట: పొలంలో ఎన్నికల ప్రచారం

image

సిద్దిపేట జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎలక్షన్‌లో భాగంగా అభ్యర్థులు ఎవరికీ తోచినట్లుగా వారు ప్రచారం చేస్తున్నారు. నంగునూరు మండలం సిద్దన్నపేటలో సర్పంచ్ అభ్యర్థి బెదురు తిరుపతి వ్యవసాయ క్షేత్రంలో కూలీలు వారి నాటు వేస్తున్నారని తెలుసుకుని పొలం దగ్గరకి వెళ్లి మరి నేను సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాను. ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.