News March 30, 2025
ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

*ఏలూరులో జిల్లా జైలులో మహిళ ముద్దాయి అనుమానాస్పదస్థితిలో మృతి* ఏలూరు గిరిజన భవన్ లో జరిగిన ఉగాది వేడుకలలో పాల్గొన్న కలెక్టర్*పెట్రోల్ పోసి వృద్ధురాలిని హతమార్చిన కేసులో వ్యక్తి అరెస్ట్*పాస్టర్ ప్రవీణ్ మృతికి కారకులైన వారిని అరెస్టు చేయాలని జీలుగుమిల్లిలో ర్యాలీ*కొయ్యలగూడెం మండలం సీతంపేట వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Similar News
News March 2, 2026
సిరిసిల్ల: 127 మంది విద్యార్థులు గైర్హాజరు

జిల్లావ్యాప్తంగా సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 127 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎంపీసీ విద్యార్థులకు మ్యాథమెటిక్స్, సీఈసీ విద్యార్థులకు పొలిటికల్ సైన్స్, బైపీసీ విద్యార్థులకు బోటనీ పరీక్ష నిర్వహించగా, మొత్తం 4764 మంది విద్యార్థులకు గాను 4637 మంది హాజరైనట్లు అధికారులు వివరించారు. పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు.
News March 2, 2026
సూర్యాపేట: గనుల టెండర్లను రద్దు చేయాలి: కేటీఆర్

సూర్యాపేట జిల్లాలో గనుల ఈ-ఆక్షన్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. సుమారు 1,100 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని నిబంధనలకు విరుద్ధంగా టెండర్లలో చేర్చారని ఆరోపించారు. డీజీపీఎస్ డీమార్కేషన్, జియో-కోఆర్డినేట్లు, అటవీ వివరాలను స్పష్టంగా వెల్లడించలేదని పేర్కొన్నారు. వెంటనే ఈ ప్రక్రియను నిలిపివేసి విచారణ జరిపించాలని కోరారు.
News March 2, 2026
GAILలో 70 పోస్టులు.. అప్లై చేశారా?

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(GAIL)లో 70 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. BE/BTech,ME/MTech అర్హతగల వారు మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.60,000-రూ.1,80,000 చెల్లిస్తారు. GATE-2026 స్కోరు, గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ, అసెస్‌మెంట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: gailonline.com


