News April 5, 2025

ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.*శ్రీ రామ నవమికి 8టన్నుల బెల్లాన్ని వితరణ చేసిన దెందులూరు MLA.* చింతలపూడిలో దంచి కొట్టిన వర్షం..నేలకొరిగిన చెట్లు.*cm పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, మంత్రి.*2024, 25 రబీ పంట కాలానికి ధాన్యం సేకరణ ప్రారంభం.*ఆటో నగర్లో స్థలాలు ఇవ్వాలని మెకానిక్‌ల సమావేశం.

Similar News

News December 8, 2025

ఘోర అగ్నిప్రమాదంలో తాడేపల్లిగూడెం యువకుడి మృతి

image

అమెరికాలోని బర్మింగ్ హామ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. అందులో తాడేపల్లిగూడేనికి చెందిన అన్వేష్ రెడ్డి ఒకరు. ఘటనలో తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా వీరి కుటుంబం HYDలోని కూకట్ పల్లిలో నివాముంటోంది.

News December 8, 2025

విజయవాడ: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చర్లపల్లి(CHZ)- షాలిమార్(SHM)(నం.07148,49) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 9.35 గంటలకు CHZలో బయలుదేరే ఈ ట్రైన్ 9వ తేదీన ఉదయం 3.20కి విజయవాడ, రాత్రి 11.50 గంటలకు SHM చేరుకుంటుందన్నారు, 10న మధ్యాహ్నం 12.10కి SHMలో బయలుదేరి 11న ఉదయం 7.40కి విజయవాడ, సాయంత్రం 4 గంటలకు చర్లపల్లి చేరుకుంటుందన్నారు.

News December 8, 2025

నిజామాబాద్ జిల్లాలో 8.4°C అత్యల్ప ఉష్ణోగ్రత

image

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన ప్రదేశాల్లో కోటగిరి 8.4°C, సాలూర 8.8, చిన్న మావంది 9.1, పొతంగల్ 9.2, జకోరా 9.2, డిచ్‌పల్లి 9.7, కల్దుర్కి 9.9°C ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఎల్లో అలర్ట్‌లో గన్నారం, మోస్రా, గోపన్న పల్లి, మదన్ పల్లి, నిజామాబాద్ నార్త్ 10.1°C ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.