News April 29, 2024

ఏలూరు జిల్లాలో నేతల బహిరంగ సభలు

image

ఏలూరు జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయం హీటెక్కుతోంది. ఈ మేరకు ప్రధాన పార్టీల నాయకులు జిల్లాలో బహిరంగ సభలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 30న దెందులూరుకు చంద్రబాబు నాయుడు, నేడు కొయ్యలగూడెంలో షర్మిల రెడ్డి బహిరంగ సభ, మే 1న ఏలూరులో జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు కొయ్యలగూడెంలో పర్యటించనున్నారు.

Similar News

News November 28, 2025

రైతులు అప్రమత్తంగా ఉండాలి: జేసీ

image

గణపవరం మండలం జల్లికొమ్మరలో ఉన్న రైతు సేవా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యం కొనుగోలు, గోనె సంచుల రిజిస్టరు, ట్రక్ షీట్‌లను పరిశీలించారు. ట్రక్ షీట్ వెనుక భాగంలో తేమ శాతాన్ని తప్పక నమోదు చేయాలని ఆదేశించారు. ‘దిత్వా’ తుఫాన్ కారణంగా రానున్న రెండు, మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

News November 28, 2025

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

image

తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే ఆరవెల్లి రాధాకృష్ణతో కలిసి ఆమె ఆసుపత్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతుల గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న నూతన నిర్మాణాలను పరిశీలించి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్ ఆమె వెంట ఉన్నారు.

News November 28, 2025

బాధితులకు రూ.1.85 కోట్లు అందజేత: కలెక్టర్

image

జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడుల కేసుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం జరిగిన విజిలెన్స్ కమిటీ సమావేశంలో డిసెంబర్ 24 నుంచి మే 25 వరకు బాధితులకు రూ.1.85 కోట్ల పరిహారం చెల్లించామని తెలిపారు. అట్రాసిటీ కేసులలో ఎఫ్ఐఆర్, చార్జిషీట్ నమోదులో జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.