News April 29, 2024
ఏలూరు జిల్లాలో నేతల బహిరంగ సభలు

ఏలూరు జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయం హీటెక్కుతోంది. ఈ మేరకు ప్రధాన పార్టీల నాయకులు జిల్లాలో బహిరంగ సభలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 30న దెందులూరుకు చంద్రబాబు నాయుడు, నేడు కొయ్యలగూడెంలో షర్మిల రెడ్డి బహిరంగ సభ, మే 1న ఏలూరులో జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు కొయ్యలగూడెంలో పర్యటించనున్నారు.
Similar News
News April 16, 2026
టీడీపీ పదవుల్లో ‘పశ్చిమ’కు పెద్దపీట

తెలుగుదేశం పార్టీ పదవుల కేటాయింపులో ప.గో. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం దక్కింది. పార్టీ పొలిట్‌బ్యూరోలో నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, రామరాజు, ఎం.ఏ. షరీఫ్‌లకు చోటు కల్పించగా.. పీతల సుజాతకు జాతీయ స్థాయి పదవి వరించింది. అంగర రామ్మోహన్‌కు మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. సీనియర్లకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక సమతుల్యత పాటించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
News April 16, 2026
టీడీపీ పదవుల్లో ‘పశ్చిమ’కు పెద్దపీట

తెలుగుదేశం పార్టీ పదవుల కేటాయింపులో ప.గో. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం దక్కింది. పార్టీ పోలిట్‌బ్యూరోలో నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, రామరాజు, ఎం.ఏ. షరీఫ్‌లకు చోటు కల్పించగా.. పీతల సుజాతకు జాతీయ స్థాయి పదవి వరించింది. అంగర రామ్మోహన్‌కు మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. సీనియర్లకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక సమతుల్యత పాటించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
News April 16, 2026
ప.గో: సహాయం చేయండి.. బహుమతి పొందండి

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునే ‘పీఎం-రాహత్’ పథకంపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. గాయపడిన వారికి రూ. 1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందని బుధవారం తెలిపారు. బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చే వారికి రూ.25 వేల నగదు పురస్కారం అందజేస్తామన్నారు. విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలని ఆమె పిలుపునిచ్చారు.


