News April 1, 2025
ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన 10 పబ్లిక్ పరీక్షలు

ఏలూరు జిల్లాలో మంగళవారం జరిగిన 10వ తరగతి సోషల్ పబ్లిక్ పరీక్షకు రెగ్యులర్ స్టూడెంట్స్ 22,704 హాజరు కావలసి ఉండగా 22,244 హాజరు అయ్యారని 460 మంది గైర్హాజరు అయ్యారని డీఈవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. వన్స్ ఫెయిల్డ్ ప్రైవేట్ స్టూడెంట్స్ 295 మందికి 169 మంది హాజరయ్యారని, 126 గైర్హాజరు అయ్యారని స్పష్టం చేశారు. మొత్తం 44 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశామన్నారు.
Similar News
News November 28, 2025
MBNR: కొనసాగుతున్న చలి తీవ్రత

మహబూబ్ నగర్ జిల్లాల్లో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. జిల్లాలో అత్యల్పంగా మిడ్జిల్ మండలం దోనూరులో 13.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. బాలానగర్ 14.1, రాజాపూర్ 14.4, మిడ్జిల్ మండలం కొత్తపల్లి, భూత్పూర్ 14.9, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 15.0, హన్వాడ 15.1, మిడ్జిల్ 15.2, మూసాపేట 15.5, మహమ్మదాబాద్ 15.7, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 15.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News November 28, 2025
ADB: బార్డర్లపై ఫోకస్ పెడితే బెటర్..!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అధికారులంతా మహారాష్ట్ర బార్డర్లపై దృష్టిసారించాల్సిన అవసరముంది. ఎందుకంటే అక్కడి నుంచే అక్రమ మద్యం ADBలోకి తీసుకొచ్చే ఆస్కారముంది. అక్కడ అక్కడ తక్కువ ధరకు దొరికే దేశీదారును అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంచే అవకాశముంది. తలమడుగు, తాంసి, బేల, భీంపూర్, భైంసా, కుబీర్, జైనథ్, చింతలమానేపల్లి ఇలా సరిహద్దు మండలాల్లో చెక్పోస్టులు, తనిఖీలు పెంచాలి.
News November 28, 2025
టాక్సిక్ వర్క్ కల్చర్లో పనిచేస్తున్నా:గర్భిణి ఆవేదన

ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా కొందరు మేనేజర్లు ఇబ్బందిపెడుతుంటారు. అలాంటి టాక్సిక్ వర్క్ కల్చర్లో ఇబ్బందిపడుతున్న 28 వారాల గర్భంతో ఉన్న బ్యాంక్ ఉద్యోగిని చేసిన రెడిట్ పోస్ట్ వైరలవుతోంది. అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యానని,103°F జ్వరంలోనూ మేనేజర్ సెలవు నిరాకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లీవ్ అడిగితే ఫోన్ చేసి తిట్టారని ఆమె ఆరోపించారు. ఇది నెట్టింట చర్చకు దారితీసింది.


