News April 3, 2025

ఏలూరు: జిల్లాలో బుధవారం 5 గురు ఆత్మహత్యలు

image

ఏలూరు జిల్లాలో బుధవారం వివిధ కారణాలతో 5 గురు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ముదినేపల్లి మండలం జానకిగూడెంకి చెందిన పిచ్చేటి కొండయ్య(42), పెదవేగి మండలం లక్ష్మీపురంకి చెందిన ఉపేంద్ర(27), పెదపాడు మండలం తోటగూడెంకి చెందిన నార్ని సాంబశివరావు(42), సకలకొత్తపల్లి చెందిన సాకేటి సూర్యారావు(52), గుడిపాడు గ్రామానికి చెందిన నూరు లాజర్ (52) ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపంతో మృతి చెందాడు.

Similar News

News April 12, 2025

ఎల్లుండి నుంచి ‘భూ భారతి’ అమలు

image

TG: భూ భారతి చట్టాన్ని ఈనెల 14 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 3 మండలాల్లో అమల్లోకి తేనుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. భూ భారతి పోర్టల్‌ను మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ పోర్టల్‌‌పై ప్రతి మండలంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News April 12, 2025

జగన్ ప్రధాన సలహాదారుడిగా సజ్జల

image

AP: 33 మందితో కూడిన PACని వైసీపీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సజ్జల రామకృష్ణారెడ్డిని కన్వీనర్‌గా నియమించింది. సజ్జలతోపాటు తమ్మినేని, ముద్రగడ, కొడాలి నాని, జోగి రమేశ్, తోట త్రిమూర్తులు, పినిపే విశ్వరూప్, కోన రఘుపతి, విడదల రజిని, రోజా, బ్రహ్మనాయుడు, నందిగం సురేశ్, ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్, వైఎస్ అవినాశ్, బుగ్గన, సాకే శైలజానాథ్ తదితరులు ఉన్నారు. వీరంతా జగన్‌కు రాజకీయ సలహాలు ఇవ్వనున్నారు.

News April 12, 2025

కృష్ణా: ఒకేషనల్ కోర్సులో జిల్లా టాపర్‌గా గాయత్రి

image

నేడు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఒకేషనల్ కోర్సుకు సంబంధించి మచిలీపట్నం లేడి యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన గాయత్రి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గుడ్లవల్లేరుకు చెందిన గాయత్రి 1000కి 988 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థినిని కాలేజీ ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ సుందర లక్ష్మి అభినందించారు. 

error: Content is protected !!