News December 4, 2024

ఏలూరు జిల్లాలో భూ ప్రకంపనలు

image

ఏలూరు జిల్లాలో బుధవారం ఉదయం భూకంపం వచ్చిందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కన్నాపురం, వేలూరుపాడు, చింతలపూడి, ద్వారకాతిరుమల తదితర చోట్ల ఐదు సెకండ్ల పాటు భూమి కంపించిందన్నారు. ఇంట్లో ఉన్న సామాగ్రి ధ్వంసమవ్వడంతో.. బయటికి పరుగులు తీసినట్లు తెలిపారు. అయితే ఎక్కడా ప్రాణనష్టం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

Similar News

News November 15, 2025

గుంటూరులో దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్

image

మహిళల బ్యాగుల్లో నుంచి బంగారం నగలు దొంగలిస్తున్న ప.గో జిల్లా తాడేపల్లిగూడెం యాగరపల్లికి చెందిన ఆరుగురు దొంగల ముఠాను గుంటూరు రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనాలపై మహిళల నుంచి ఫిర్యాదులు అందడంతో శుక్రవారం బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ముమ్మర తనిఖీలు చేసి వీరిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.6.22లక్షల విలువైన 75 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ముగ్గురు మహిళలు ఉన్నారు.

News November 15, 2025

భీమడోలు: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన హత్య కేసు నిందితుడు

image

ఏడేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు ఎట్టకేలకు భీమడోలు పోలీసులకు చిక్కాడు. వివరాలు ఇలా.. 2018లో ఏలూరుకు చెందిన ఆటోడ్రైవర్ రామప్రసాద్ రాత్రి వేళ తన ఆటోతో వెళ్తుండగా గుడివాడకు చెందిన స్టీవెన్ అడ్డగించి.. రామప్రసాద్‌ను హత్య చేసి ఆటో ఎత్తుకెళ్లాడు. ఈ కేసులో స్టీవెన్‌ను అరెస్ట్ చేశారు. 2 వాయిదాల తర్వాత నిందితుడు కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. నిన్న గుడివాడలో అరెస్ట్ చేశారు.

News November 14, 2025

పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలి

image

జిల్లాలో పెద్ద ఎత్తున వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాలని జేసి రాహుల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారం పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ సంస్థలలో స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంగా పాటించాలన్నారు. వ్యక్తిగత, సమాజ పరిశుభ్రత కార్యక్రమాలను జిల్లా అంతట విస్తృతంగా నిర్వహించాలన్నారు.