News December 4, 2024

ఏలూరు జిల్లాలో భూ ప్రకంపనలు

image

ఏలూరు జిల్లాలో బుధవారం ఉదయం భూకంపం వచ్చిందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కన్నాపురం, వేలూరుపాడు, చింతలపూడి, ద్వారకాతిరుమల తదితర చోట్ల ఐదు సెకండ్ల పాటు భూమి కంపించిందన్నారు. ఇంట్లో ఉన్న సామాగ్రి ధ్వంసమవ్వడంతో.. బయటికి పరుగులు తీసినట్లు తెలిపారు. అయితే ఎక్కడా ప్రాణనష్టం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

Similar News

News January 26, 2025

ప.గో: జిల్లాకు హీరో వెంకటేశ్, మీనాక్షి చౌదరి

image

సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ మీట్ ఆదివారం భీమవరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక ఎస్ఆర్‌కే ఇంజినీరింగ్ కళాశాలలో ఈవెంట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మీట్‌కి హీరో వెంకటేశ్, హీరోయిన్లు, బుల్లిరాజు, మరికొంత మంది నటులు సందడి చేయనున్నారు. ఈ సినిమా రిలీజైన రోజే రూ.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని చిత్ర బృందం పేర్కొంది.

News January 26, 2025

భీమవరం: తుది జాబితా ఆమోదం: జేసీ

image

పశ్చిమ గోదావరి జిల్లాలోని భూముల మార్కెట్ విలువ పెంపునకు సమర్పించిన ప్రతిపాదనల తుది జాబితాను ఆమోదించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా భీమవరం కలెక్టరేట్‌లో జేసీ జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్స్ పరిధిలోని అధికారులతో సమావేశమై జిల్లాలోని భూముల విలువల పెంపుదలకు ప్రతిపాదనలను సమీక్షించి తుది ప్రతిపాదలను సమీక్షించి ఆమోదించారు.

News January 26, 2025

భీమవరం: గణతంత్ర వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన జెసీ 

image

భీమవరం కలెక్టరేట్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు ప్రతిబింబించేలా శకటాలు, స్టాల్స్ ఏర్పాట్లు చేయడం చేస్తున్నట్లు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రేక్షకులు వీక్షించేలా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.