News October 7, 2024

ఏలూరు జిల్లాలో యువతకు ఉచిత శిక్షణ

image

ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు DLTC ప్రధానాచార్యుడు ఎస్.ఉగాది రవి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాశ్ యోజన కింద ఆఫీసు అపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ కోర్సులో 4 నెలలు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. ఇంటర్ ఆపైన చదివిన వాళ్లు, 15 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు అర్హులని తెలిపారు. ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Similar News

News November 26, 2025

RRR కేసు.. ఐపీఎస్‌ పీవీ సునీల్‌కుమార్‌కు సిట్‌ నోటీసులు

image

ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్టడీలో ‘థర్డ్ డిగ్రీ’ ప్రయోగించారన్న కేసులో మాజీ సీఐడీ చీఫ్, ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌కు గుంటూరు సిట్ బుధవారం నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 4న విచారణకు హాజరుకావాలని అందులో స్పష్టం చేసింది. 2021లో రాజద్రోహం కేసు విచారణ సమయంలో తనను కస్టడీలో హింసించి, హత్యకు కుట్ర పన్నారన్న రఘురామ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

News November 26, 2025

భీమవరంలో మెప్మా జాబ్ మేళా ప్రారంభం

image

మెప్మా సంస్థ ఆధ్వర్యంలో, నిపుణ సహకారంతో భీమవరం మున్సిపల్ కౌన్సిల్ హాలులో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేళాలో 16 కంపెనీలు పాల్గొన్నాయని, ఇలాంటి అవకాశాలు నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడతాయని వారు అన్నారు.

News November 26, 2025

రైతు ఆర్థిక బలోపేతానికి ‘రైతన్నా.. మీకోసం’: కలెక్టర్

image

రైతును ఆర్థికంగా బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. బుధవారం పాలకోడేరు మండలం కుముదవల్లిలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఆమె రైతుల సమక్షంలో నిర్వహించారు. రైతు సత్యనారాయణ రాజు మండువా పెంకుటిల్లు అరుగుపైనే ఈ కార్యక్రమం జరిగింది.