News October 11, 2024
ఏలూరు జిల్లాలో రికార్డ్ స్థాయిలో ధరలు.. KG రూ.400

ఏలూరు జిల్లాలోని కైకలూరులో రికార్డు స్థాయిలో వెల్లుల్లి ధర పలుకుతోంది. ఇప్పటికే ఉల్లి, టమాటాలు సెంచరీకి దగ్గరలో ఉండగా..వాటికి వెల్లుల్లి తోడవ్వడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వెల్లుల్లి కిలో రూ. 400 పలుకుతోందని వినియోగదారులు, వ్యాపారస్థులు చెబుతున్నారు. ఇప్పటికే పలు నిత్యావసర సరుకులు ప్రభుత్వం తక్కువ ధరలకు ఇచ్చే ఏర్పాట్లు చేయగా.. వాటిలో వెల్లుల్లి కూడా చేర్చాలంటున్నారు.
Similar News
News November 16, 2025
ఫోన్ కోసం అలిగి.. బాలుడు అదృశ్యం: ఎస్ఐ

సెల్ ఫోన్ చూడవద్దని తల్లి మందలించడంతో ఓ బాలుడు (11) అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన నరసాపురంలో చోటుచేసుకుంది. ఈ నెల 14న బాలుడు ఫోన్ పగులగొట్టి వెళ్లిపోయాడని, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై జయలక్ష్మి తెలిపారు. బాలుడి ఆచూకీ కోసం పట్టణం, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.
News November 16, 2025
పెదఅమీరం: తొలి జీతం.. గ్రామదేవతకు అందజేత

కాళ్ల మండలం పెదఅమిరం గ్రామ దేవత శ్రీ పల్లాలమ్మ దేవాలయ అభివృద్ధికి ఉపాధ్యాయుడు బూరాడ వెంకటకృష్ణ శనివారం తన మొదటి జీతాన్ని అందజేశారు. మెగాడీఎస్సీ 2025 లో స్కూల్ అసిస్టెంట్(మాథ్స్) ఉద్యోగం సాధించిన వెంకటకృష్ణ తన తొలి జీతం మొత్తం రూ.50,099 లను ఆలయ అభివృద్ధి కమిటీ పెద్ద కోరా రామ్మూర్తికి అందజేశారు. ఆయనను పలువురు అభినందించారు.
News November 16, 2025
ఏపీకే ఫైలు ఓపెన్ చేయొద్దు: సీఐ యాదగిరి

చరవాణీలకు వచ్చే ఏపీకే ఫైలు తెరవొద్దని నరసాపురం పట్టణ సీఐ బి.యాదగిరి ప్రజలకు సూచించారు. ఆయన ఫోన్‌కు వాహన అపరాధ రుసుము చలానా పెండింగ్ ఉన్నట్లుగా మెసేజ్ వచ్చింది. ఆ ఫైలు సందేశాన్ని ప్రజలకు అవగాహన నిమిత్తం సామాజిక మాధ్యమంలో అందుబాటులో ఉంచారు. అటువంటి ఫైళ్లను తెరవొద్దని, తెరిస్తే ఫోన్ హ్యాక్ అయి సైబర్ నేరగాళ్ల చేతికి బ్యాంకు ఖాతాలు, పాస్‌వర్డ్ చేరే ప్రమాదం ఉందని ఆయన సూచించారు.


