News October 11, 2024
ఏలూరు జిల్లాలో రికార్డ్ స్థాయిలో ధరలు.. KG రూ.400
ఏలూరు జిల్లాలోని కైకలూరులో రికార్డు స్థాయిలో వెల్లుల్లి ధర పలుకుతోంది. ఇప్పటికే ఉల్లి, టమాటాలు సెంచరీకి దగ్గరలో ఉండగా..వాటికి వెల్లుల్లి తోడవ్వడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వెల్లుల్లి కిలో రూ. 400 పలుకుతోందని వినియోగదారులు, వ్యాపారస్థులు చెబుతున్నారు. ఇప్పటికే పలు నిత్యావసర సరుకులు ప్రభుత్వం తక్కువ ధరలకు ఇచ్చే ఏర్పాట్లు చేయగా.. వాటిలో వెల్లుల్లి కూడా చేర్చాలంటున్నారు.
Similar News
News November 11, 2024
మన ప.గో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం వినిపిస్తారా?
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వాటికి ఉమ్మడి ప.గో జిల్లా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికల అనంతరం జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశం కావడంతో ప్రజల్లోనూ, నాయకుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ముందు గ్రామంలో సమస్యలు , యువతకు ఉద్యోగాలు వంటి అంశాలపై ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు గుమ్మరించారు. మరి వాటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో గళం వినిపిస్తారా? లేదా? మీరేమంటారు. కామెంట్ చేయండి.
News November 10, 2024
ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఉచిత ఇసుక: కలెక్టర్ నాగారాణి
ఇసుక వినియోగదారులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఉచిత ఇసుకను పొందాలని ప.గో.జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు. జిల్లాలో ఇసుక అందుబాటులో లేనందున తూ.గో.జిల్లా తిపర్రు- 2&3, ఔరంగాబాద్ రీచ్‌ల ద్వారా ఇసుకను పొందేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. తిపర్రులో రూ.96.02, ఔరంగాబాద్‌లో రూ.229 చెల్లించాల్సి ఉందని, దీనికి రవాణా ఛార్జీలు అదనం అన్నారు.
News November 10, 2024
కూటమి నాయకులపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు
కూటమి నేతల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న నిందితుడిపై శనివారం కేసు నమోదు చేశామని నరసాపురం పట్టణ సీఐ బీ.యాదగిరి తెలిపారు. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన నామాలదిన్ని వెంకట రెడ్డి కొన్నేళ్లుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ఫొటోలు మార్పింగ్ చేస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా ప్రచారం చేస్తున్నట్లు పలువురు ఫిర్యాదు చేశారు.