News December 3, 2024

ఏలూరు జిల్లాలో రూ.367.63 కోట్ల ధాన్యం కొనుగోలు

image

ఏలూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు రూ.367.63 కోట్ల విలువైన 159782.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 20,959 మంది రైతుల నుండి కోనుగోలు చేశామని జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెం.18004256453 కు ఫోన్ చేయాలన్నారు.

Similar News

News December 5, 2025

ప.గో: తల్లిని కాపాడిన కొడుకు

image

భీమవరం మండలం జొన్నలగురువు గ్రామానికి చెందిన ఎన్.దీక్షిత్ సమయస్ఫూర్తి ప్రదర్శించి తన తల్లి ప్రాణాలను కాపాడాడు. శుక్రవారం ఎంపీపీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్‌కు దీక్షిత్ తన తల్లిని పిలవడానికి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆమె విద్యుత్ షాక్‌కు గురై ఉండటాన్ని గమనించాడు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. దీంతో తల్లికి పెను ప్రమాదం తప్పింది. దీక్షిత్‌ను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

News December 5, 2025

ప.గోలో 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరందించేలా ప్రాజెక్ట్

image

జిల్లాలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.1,400 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. 16 మండలాల పరిధిలోని 862 గ్రామాల్లోని 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీని కోసం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

News December 5, 2025

నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: DEO

image

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.