News December 3, 2024
ఏలూరు జిల్లాలో రూ.367.63 కోట్ల ధాన్యం కొనుగోలు
ఏలూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు రూ.367.63 కోట్ల విలువైన 159782.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 20,959 మంది రైతుల నుండి కోనుగోలు చేశామని జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెం.18004256453 కు ఫోన్ చేయాలన్నారు.
Similar News
News January 18, 2025
జర్మనీ అబ్బాయి, ఏలూరు జిల్లా అమ్మాయి నిశ్చితార్థ వేడుక
దేశాలు దాటిన ప్రేమ పెళ్లిగా మారిన అపూర్వ ఘటన టీ.నర్సాపురం మండలం ఏపుగుంటలో గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఏపుగుంటకు చెందిన లావణ్య జర్మనీలో ఉద్యోగ రీత్యా పనిచేస్తున్న సమయంలో మార్కస్, లావణ్యల మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. దీంతో ఇవాళ గ్రామంలో వీరి నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. వివాహం జర్మనీలో జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
News January 18, 2025
ఏలూరు: చనిపోయిన కోడికి వేలం..రూ. లక్ష
సంక్రాంతి కోడిపందేల బరిలో మృతి చెందిన ఓ కోడికి యజమానులు వేలంపాట నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే జాలిపూడికి చెందిన నవీన్ చంద్రబోస్ వేలంపాటలో పాల్గొన్నారు. రూ.1,11,111 వెచ్చించి కోడిని దక్కించుకున్నారు. ఈ వేలం పాటకు అధిక సంఖ్యలో జనం పోటీ పడగా చంద్రబోస్ గెలుపొందారు.
News January 18, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ బుల్లి రాజుది మన ఏలూరే
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని బుల్లి రాజు క్యారెక్టర్‌తో అందరినీ అలరించిన రేవంత్ ఏలూరు జిల్లా నిడమర్రు మండలం చానమిల్లి గ్రామానికి చెందిన రొయ్యల వ్యాపారి భీమాల శ్రీనివాస రావు కుమారుడు. రేవంత్ ‘సంక్రాంతికి వస్తున్నాం’లో వెంకటేశ్‌కి కొడుకుగా నటించే ఛాన్స్ కొట్టేశాడు. 11 సంవత్సరాల వయసులో సినిమా ఇండస్ట్రీకి కొత్తైనా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.