News September 9, 2024

ఏలూరు జిల్లాలో రేపు కొన్ని స్కూళ్లకు సెలవు

image

ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా మంగళవారం కొన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ అధికారి అబ్రహం సోమవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. భీమడోలులో 1, పెదపాడులో 7, మండవల్లిలో 18, కైకలూరులో 9, ఏలూరులో 1, ముదినేపల్లిలో 3, కలిదిండిలో 5 స్కూళ్లకు సెలవు ఉంటుందన్నారు. మిగతా పాఠశాలలు యధావిధిగా నడపవచ్చని సూచించారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

Similar News

News October 3, 2024

పాలకోడేరు: నేర సమీక్ష నిర్వహించిన ఎస్పీ నయీం అస్మి

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామంలోని జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జూమ్ మీట్ ద్వారా నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు, అరెస్టులు, దర్యాప్తులపై ఆరా తీశారు. అలాగే దసరా, దీపావళికి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు.

News October 3, 2024

ఏలూరు: నేడే టెట్ పరీక్ష నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

image

ఏలూరు జిల్లాలో నేటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని డీఈవో అబ్రహం సూచించారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు నిర్ణీత వేళకు పరీక్ష కేంద్రానికి హాజరు కావాల్సిందే. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కనీసం గంట ముందుగా అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాలన్నారు.

News October 2, 2024

జాతీయస్థాయి పోటీలకు కొయ్యలగూడెం విద్యార్థి

image

కొయ్యలగూడెం వీఎస్ఎన్ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి వై.రాహుల్ పల్నాడు జిల్లాలో జరిగిన స్టేట్ లెవెల్ క్రీడల్లో పాల్గొని, జాతీయ క్రీడా పోటీలకు ఎంపికయ్యారని కళాశాల కరెస్పాండెంట్ స్వామి తెలిపారు. బుధవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి రాహుల్‌ను అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు.