News September 27, 2024
ఏలూరు జిల్లాలో రేపు వైసీపీ శ్రేణుల పూజలు
కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేయాలని జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు. 100 రోజుల పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని పక్కదారి పట్టించడానికి జంతువుల కొవ్వుతో లడ్డూ తయారీ అంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీసి వైసీపీపై అభాండాలు వేస్తున్నారన్నారు.
Similar News
News October 4, 2024
ఏలూరు: ‘రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలి’
రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. స్వర్ణాంధ్ర-2047 దార్శనిక పత్రం రూపకల్పన లో భాగంగా వచ్చే ఐదేళ్లకు జిల్లా స్థాయి దార్శనిక పత్ర రూపకల్పన కోసం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరులో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
News October 4, 2024
రాష్ట్ర ట్రైకార్ ఛైర్మన్‌గా ఏలూరు జిల్లా నేత బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ ఛైర్మన్‌గా పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి బొరగం శ్రీనివాసులు శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ మైనారిటీ స్టేట్ డైరెక్టర్ షేక్ సుభాని, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ శాఖ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
News October 4, 2024
ప.గో: మ్యారేజ్ బ్యూరో మోసం.. పెళ్లి సంతోషం 15 రోజులే!
భీమవరానికి చెందిన యువతిని సత్యసాయిజిల్లాకు చెందిన వేమారెడ్డి పెళ్లి చేసుకొని మోసపోయాడు. 44 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోవడంతో ఆయన మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించి రూ.3 లక్షలు చెల్లించారు. వారు చూపించిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన 15 రోజులకు ఆమె భీమవరం వెళ్లిపోయి తిరిగిరాలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బ్రోకర్లు కొన్నిరోజులు ఉండి వచ్చేయమన్నారని యువతి చెప్పడం గమనార్హం.