News March 16, 2025

ఏలూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తప్పదా?

image

నూజివీడులో 32 వార్డులు ఉన్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో YCP 25 చోట్ల గెలవడంతో ఛైర్‌పర్సన్‌గా త్రివేణి దుర్గా ఎన్నికయ్యారు. ఇటీవల 10మంది కౌన్సిలర్లు TDPలోకి రావడంతో ఆ పార్టీ బలం 17కి చేరింది. దీంతో ప్రస్తుత ఛైర్‌పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి.. ఆ పదవిని తమ ఖాతాలో వేసుకోవడానికి TDP ప్రయత్నిస్తోంది. ఇది జరగాలంటే 22 మంది మద్దతు అవసరం కాగా.. మిగిలిన 5మంది కౌన్సిలర్ల కోసం టీడీపీ ఎదురు చూస్తోంది.

Similar News

News December 3, 2025

పలు జిల్లాలకు వర్షసూచన

image

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో నేడు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News December 3, 2025

ఏపీలో ఫిలిం టూరిజానికి మాస్టర్ ప్లాన్: మంత్రి దుర్గేష్

image

ఆంధ్రప్రదేశ్‌లో ఫిల్మ్ టూరిజానికి ప్రోత్సాహం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ప్రకటించారు. ఏపీని దేశంలోనే సినిమా షూటింగ్‌లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తామన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. విశాఖ బీచ్‌లు, గోదావరి నదీ తీరాలు, అరకు, లంబసింగి, తిరుపతి, శ్రీశైలం వంటి ప్రదేశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

News December 3, 2025

నవ దంపతులతో సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

image

కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవ దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అందరూ కోరుకుంటారు. అలా వర్ధిల్లాలనే వారితో సత్యనారాయణస్వామి వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం ఆచరిస్తే వారి జీవితంలో సకల సంపదలు, సౌభాగ్యాలు, సత్సంతానం కలుగుతాయని స్వయంగా నారాయణుడే నారదునికి చెప్పాడని నమ్ముతారు. సత్యనారాయణ స్వామి త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవం కాబట్టి, ఆయన ఆశీస్సులు ముందుగా పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.