News December 18, 2024

ఏలూరు జిల్లాలో సుపరిపాలన వారోత్సవాలు: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో డిసెంబర్ 19 నుంచి 24 వరకు నిర్వహించే ప్రభుత్వ సుపరిపాలన వారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులకు పిలుపునిచ్చారు. బుధవారం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. గుడ్ గవర్నెన్స్ కార్యక్రమానికి సంబంధించి కలెక్టరేట్ ఆవరణ గోదావరి సమావేశ మందిరంలో వర్క్ షాప్ ఏర్పాటు చేయాలన్నారు. సామాన్యుల సమస్యలకు పరిష్కారం అందించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.

Similar News

News December 19, 2024

ఖరీఫ్ సీజన్లో రూ.361 కోట్లు మంజూరు: కలెక్టర్

image

ప.గో జిల్లా ఖరీఫ్ సీజన్‌లో రూ.361 కోట్లు పంట రుణాలను రైతులకు అందజేశామని జిల్లా కలెక్టర్ నాగరాణి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సీజన్లో రూ.410 కోట్ల పంట రుణాలు మంజూరు చేయవలసి ఉండగా.. ఇప్పటికే రూ.162 కోట్ల రుణాలు మంజూరు చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు. త్వరలోనే మిగిలిన రుణాలను పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

News December 18, 2024

గోపాలపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

గోపాలపురం మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. జగన్నాథపురంలో తారు లోడ్‌తో వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చిన మరో లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీల ముందు భాగాలు పూర్తిగా నుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అతివేగంగా నిర్లక్ష్యంగా లారీ రావడమే ఈ ప్రమాదానికి కారణం అని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని తెలియాల్సి ఉంది.

News December 18, 2024

నల్లజర్లలో మహిళను చీరతో కట్టేసి దొంగతనం

image

నల్లజర్లలోని దూబచర్లలోని రిటైర్డ్ అగ్రికల్చరల్ ఆఫీసర్ కృష్ణమూర్తి నివాసంలో తెల్లవారుజామున నిద్రలో ఉండగా ముగ్గురు ఆగంతకులు మాస్క్ ధరించి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని హెల్పర్, యజమానిని చీరతో కట్టేసి, మంచంపై కదల్లేని స్థితిలో ఉన్న మహిళ ఒంటిపై నగలు, బీరువాలో సొమ్ము దోచుకెళ్లారు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్ సాయంతో దర్యాప్తు చేపట్టామన్నారు.